సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత మహేష్ చేస్తున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం”( Guntur Kaaram ).
ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా ఎప్పుడు రికార్డులు బద్దలు కొడదామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాపై అటు ఆడియెన్స్ తో పాటు ఇటు ఫ్యాన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.
దీంతో షూట్ ఇంకా ఎంత బాలన్స్ ఉంది అనే విషయంలో తాజాగా నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు.

ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు అలాగే ఒక బిట్ సాంగ్ ఉందని అందులో మూడు పాటలు, బిట్ సాంగ్ షూటింగ్ అయిపోయిందని మిగిలిన సాంగ్ షూట్ ఈ నెల 21న చిత్రీకరించనున్నాం అంటూ నాగవంశీ ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు.ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు సాంగ్స్ ను రిలీజ్ చేసారు.

అయితే రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ ఎప్పుడు బిగిన్ చేస్తారా అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఫ్యాన్స్ ఇదే విషయం మేకర్స్ ను అడుగుతుండడంతో ఈ విషయం మీద కూడా క్లారిటీ ఇచ్చారు.సాంగ్స్, ట్రైలర్ కూడా మంచి డేట్స్ చూసుకుని రిలీజ్ చేస్తామని చెప్పి గుడ్ న్యూస్ తెలిపాడు.
దీంతో ఈ విషయంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రీలీల ( SreeLeela) , మీనాక్షి చౌదరి ( Meenakshi Chaudhary ) హీరోయిన్ లుగా నటిస్తుండగా జగపతి బాబు( Jagapathi babu ) విలన్ గా కనిపిస్తున్నాడు.
ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.