మామిడి తోటలను( Mango Cultivation ) ఆశించే బ్యాక్టీరియల్ నల్ల మచ్చ తెగుళ్లు ఒక బ్యాక్టీరియా( Bacteria ) ద్వారా సోకుతాయి.ఈ బ్యాక్టీరియా దాదాపుగా 8 నెలల వరకు జీవ కణాలపై జీవిస్తుంది.
మామిడి చెట్లకు గాయాలు అయితే వాటి ద్వారా ఈ తెగుళ్లు చెట్టులోకి ప్రవేశిస్తాయి.గాలి లేదా వర్షం ద్వారా ఒక చెట్టు నుండి మరొక చెట్టుకి ఈ తెగులు వ్యాపిస్తాయి.
మామిడి చెట్ల ఆకులపై, కాయలపై చిన్నటి నల్ల మచ్చలు ఏర్పడితే ఆ చెట్లకు నల్ల మచ్చ తెగుళ్లు సోకినట్టే.ఈ మచ్చల అంచులు పసుపు రంగులో ఉంటాయి.
ఈ తెగుళ్లు( Pests ) అధికం అయితే ఆకులు ఎండిపోయి రాలిపోయే అవకాశం ఉంది.ఈ ఆకుల నుంచి జిగురు లాంటి పదార్థం కారడం గమనించవచ్చు.
తెగుళ్ల తీవ్రత ఎక్కువగా ఉంటే పండ్ల నాణ్యత దెబ్బతింటుంది.పండ్లు కోతకు రాకముందే నేల రాలుతాయి.

తెగులు నిరోధక ఆరోగ్యకరమైన మొక్కలను ఎంపిక చేసుకుని తోటలలో నాటుకోవాలి.మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలేటట్లు చూడాలి.ముఖ్యంగా మామిడి చెట్లకు గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.తెగులు సోకిన మొక్కల కొమ్మలను, కాయలను వెంటనే తొలగించాలి.పరిశుభ్రం చేసిన పనిముట్లను మాత్రమే తోటలలో ఉపయోగించాలి.సేంద్రీయ పద్ధతి( Organic method )లో ఈ నల్ల మచ్చ తెగుళ్ళను నివారించాలంటే.
కాపర్ ఆక్సి క్లోరైడ్ కలిగి ఉండే పదార్థాలను మొక్కల ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.అసినేటో బాక్టేర్ బౌమన్ని లాంటి జీవ నియంత్రణ ఏజెంట్లను తెగుళ్లు సోకిన చెట్లపై ప్రయోగించడం వల్ల కూడా తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు.

రసాయన పద్ధతిలో ఈ తెగుళ్లను నివారించాలంటే.థియోఫనేట్- మిథైల్( Thiophanate methyl ) లేదంటే బెంజిమిడజోల్ కలిగి ఉండే మందులను ఉపయోగించి ఈ తెగులను నివారించవచ్చు.మామిడి తోటలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ ఏవైనా తెగుళ్లు సోకితే వాటిని పంట నుంచి వేరు చేసి తెగుళ్లను నివారించేందుకు చర్యలు వెంటనే చేపడితే.పంట సంరక్షించబడి అధిక దిగుబడి పొందవచ్చు.








