NTR: తాతగారి మరణం నాలో సగం ధైర్యాన్ని చంపేసింది.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 Jr Ntr Emotional Words About Sr Ntr-TeluguStop.com

గత ఏడాది విడుదల అయినా ఆర్ఆర్ఆర్ సినిమాతో( RRR ) పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్.ఈ సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరింత పెరిగింది.

ఇక అదే ఊపుతో జూనియర్ ఎన్టీఆర్ తదుపరి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.కాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో( Devara ) నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

Telugu Devara, Janhvi Kapoor, Jr Ntr Sr Ntr, Ntr, Koratala Siva, Nandamuritaraka

ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మొదలైంది.ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.అంతేకాకుండా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఎందుకంటే ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత నటిస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.ఈ సినిమాలో వీలైనంత తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు ఎన్టీఆర్.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక వీడియో చక్కర్లు కొడుతోంది.

Telugu Devara, Janhvi Kapoor, Jr Ntr Sr Ntr, Ntr, Koratala Siva, Nandamuritaraka

ఆ వీడియోలో ఒక షోలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ చేసిన వాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఆ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ తన తాత సీనియర్ ఎన్టీఆర్( Senior NTR ) గురించి మాట్లాడుతూ.ఒకసారి నన్ను మా అమ్మను మా తాతగారు కూర్చోబెట్టి నా మనవడిని నా అంత వాడిని చేయాలని చెప్పారు.

నా అంత వాడిని చేయడంలో మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తించండి నా వంతు బాధ్యత నీరు నిర్వర్తిస్తాను అని తెలిపారు.కానీ ఆయన చనిపోయారు.నాకు కొండంత శక్తి ఆయనే.నాకు ఎందుకో తెలియదు మా తాతగారు అంటే పిచ్చి ఒక రకంగా చెప్పాలంటే మా తాత గారికి నేను ఎడిక్ట్ అయిపోయాను.

Telugu Devara, Janhvi Kapoor, Jr Ntr Sr Ntr, Ntr, Koratala Siva, Nandamuritaraka

కానీ ఆయన ఎప్పుడైతే చనిపోయారో నా వెనుక ఉన్న కొండంత బలం తగ్గిపోయినట్టు అనిపించింది.ఇక కొండంత బలం తగ్గిపోతే ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను.అలా తాతగారి మరణం నాలో సగం ధైర్యాన్ని చంపేసింది.నా లైఫ్ లో నాకు బాధగా అనిపించిన సందర్భం అంటే ఇది ఒకటే ఇంతకు మించిన బాధ నా లైఫ్ లో ఇంకా ఏమీ ఉండదు అని తెలిపారు ఎన్టీఆర్.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube