అమెరికా అధ్యక్షుడు.ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి అధినేత.
కనుసైగతో ఏ దేశాన్నైనా, ఎవరినైనా శాసించగల పవర్ ఆయన సొంతం.ప్రపంచ గమనాన్ని రెప్పపాటులో మార్చగల నిర్ణయాధికారం అగ్రరాజ్యాధినేత చేతుల్లో వుంటుంది.అందుకే ఆయనకు ఎక్కడికి వెళ్లినా గౌరవ మర్యాదలు దక్కుతాయి.2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండటంతో సహజంగానే దీనిని ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా గమనిస్తున్నాయి.కొత్త అధ్యక్షుడు ఎవరు అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ( Vladimir Putin )అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తదుపరి అమెరికా అధ్యక్షుడు మరింత నిర్మాణాత్మకంగా వుంటారని ఆశిస్తున్నట్లు పుతిన్ వ్యాఖ్యానించారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్ర పెస్కోవ్ ఎన్‌బీసీ న్యూస్‌తో అన్నారు.ఇప్పటి నుంచి మీరు రష్యాతో మరింత జాగ్రత్తగా ఉండాలని అర్ధం చేసుకునే ఎవరితోనైనా పనిచేయడానికి అధ్యక్షుడు సిద్ధంగా వున్నారని చెప్పారు.ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) గురించి ప్రస్తావించకుండా .ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒకే రోజులో ముగించగలనని డొనాల్ట్ ట్రంప్ చేసిన ప్రకటన తప్పుదారి పట్టించిందని పెస్కోవ్ పేర్కొన్నారు.ఉక్రెయిన్‌కు అమెరికా నిధులు అందించడం పట్ల ఆయన నిరాశ వ్యక్తం చేశారు.అమెరికా అధినాయకత్వం యుద్ధాన్ని మరింత కాలం కొనసాగేలా చేస్తోందని పెస్కోవ్ మండిపడ్డారు.

వ్లాదిమిర్ పుతిన్ తన లక్ష్యాలను సాధించే వరకు ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించేది లేదని ఈ వారం పునరుద్ఘాటించిన తర్వాత ఉక్రెయిన్‌ను బలపరిచిన పశ్చిమ దేశాలు రష్యాపై యుద్ధం చేస్తున్నాయని దిమిత్రి ఆరోపించారు.దాదాపు 24 ఏళ్లుగా అధికారంలో వున్న తర్వాత మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు పుతిన్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.అలాగే రష్యా ఎన్నికల్లో( Russian elections ) మూడవ దేశం జోక్యం చేసుకోవడంపై పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రష్యా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే తమ దేశ చట్టాల ప్రకారం శిక్ష వుంటుందని హెచ్చరించారు.
తమ ప్రజల స్వేచ్ఛను, వారి సార్వభౌమాధికారాన్ని , భవిష్యత్తును ఎంచుకునే హక్కును పరిరక్షిస్తున్నామని పుతిన్ తెలిపారు.







