డబ్బు కోసమే పిచ్చి సినిమాలలో నటించాను ... ప్రకాష్ రాజు షాకింగ్ కామెంట్స్!

సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ప్రకాష్ రాజ్ ( Prakash Raj ) ఒకరు.ఈయన ఎలాంటి పాత్రలలోనైనా పరకాయ ప్రవేశం చేసేవారు.

 Prakash Raj Says He Done Stupid Movies For Money , Prakash Raj , Tollywood, Po-TeluguStop.com

విలన్ పాత్రలలోను తండ్రి పాత్రలలోను తాతయ్య పాత్రలలోను ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్నన పొందారు.ఇకపోతే ప్రకాష్ రాజ్ తరచూ వివాదాలలో కూడా నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలెబ్రిటీలకు సంబంధించిన విషయాలతో పాటు రాజకీయ విషయాలను కూడా ప్రస్తావిస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటారు.

Telugu Pokiri, Prakash Raj, Stupid, Tollywood-Movie

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన సినిమాల గురించి కొన్ని విషయాలు తెలియజేశారు.తాను ఎన్నో సినిమాలలో రిజెక్ట్ చేయబడ్డారని తెలిపారు.ఇలా సినిమాలలో నన్ను తీసేస్తే నేనెప్పుడూ కూడా బాధపడలేదని నన్ను రిజెక్ట్ చేయడం వెనక ఎంత రాజకీయం జరిగిందో నేను ఊహించగలను అందుకే ఏ సినిమాలోనైనా నన్ను రిజెక్ట్ చేస్తే నేను బాధపడనని తెలియజేశారు.

ఇక నేను ఒక సినిమాకు కమిట్ అయ్యాను అంటే ముందు నేను అక్కడ సౌకర్యంగా ఉన్నానా లేదా అనే విషయం గురించి ఆలోచించి తర్వాత ఇతర విషయాల గురించి ఆలోచిస్తానని తెలిపారు.

Telugu Pokiri, Prakash Raj, Stupid, Tollywood-Movie

ఇకపోతే కొన్నిసార్లు నేను కేవలం డబ్బు కోసమే కొన్ని పిచ్చి పిచ్చి సినిమాలలో కూడా నటించానని ఈయన తెలియజేశారు.ఇక చాలామంది నా సినిమాలు చూసి ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తున్నావు అంటూ కూడా కామెంట్లు చేస్తారు నేను ఓవర్ యాక్షన్ చేశాను అంటే నటన పరంగా నేను మంచిగా చేశానని అర్థం అంటూ ప్రకాష్ రాజ్ ( Prakash Raj )ఈ సందర్భంగా వెల్లడించారు.ఇక నాకు కమర్షియల్ సినిమాలో అంటే ఎలాంటి ద్వేషం లేదు అంటూ కూడా ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్( Comments viral ) అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube