రాష్ట్రములో పలు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగ అరెస్ట్..

రాష్ట్రములో పలు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగ అరెస్ట్.ఐరన్ రాడ్, ఐదు వందల రూపాయలు స్వాధీనం.

 An Inter-district Thief Who Is Committing Many Thefts In The State Has Been Arre-TeluguStop.com

నిందుతుని మీద పలు జిల్లాల్లో 61 కేసులు, పలు కేసుల్లో జైలు జీవితం, పలు సందర్భాల్లో పిడి యాక్ట్ నమోదు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో 02 కేసులు నమోదు.

సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందుతుని వివరాలు వెల్లడించిన పట్టణ సి.ఐ ఉపేందర్.నిందితుని వివరాలు.మడక నర్సయ్య @ చిరంజీవి, తండ్రి: లింగయ్య,మర్రిపెళ్ళి, బ్రహ్మణపల్లి(గ్రామం ), అంతర్గాం(మండలం ), పెద్దపల్లి జిల్లా.ఈ సందర్భంగా సి.ఐ ఉపేందర్ మాట్లాడుతూ…పెద్దపల్లి జిల్లా కి చెందిన మడక నర్సయ్య అనే వ్యక్తి చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభ మార్గములో డబ్బులు సంపాదించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేయవచ్చు అని దొంగతనాలని ఎంచుకొని గతంలో తెలంగాణ రాష్ట్రoలోని పలు జిల్లాలలో చాలా దొంగతనాలు చేసి

పలు కేసులల్లో జైలు జీవితం కూడా గడపడం జరిగింది.అయిన కూడా మడక నర్సయ్య మీద రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో 61 దొంగతనం కేసులు నమోదు కాగా పలు కేసుల్లో జైలుకు వెళ్ళి వచ్చిన కూడా మరల దొంగతనాలకు పాల్పడగా నర్సయ్య మీద పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించినారు.మడక నర్సయ్య జైలు నుంచి గత ఫిబ్రవరి నెలలో బయటకు వచ్చి మరల అక్టోబర్ నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తంగళ్ళపల్లి మండలం లోని రాల్లపేట గ్రామంలోని పెద్దమ్మ గుడిలో, ఆ తర్వాత నవంబర్ నెలలో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతగట్టు లోని ఎల్లమ్మ గుడిలో,

ఆతర్వాత మహబూబ్ నగర్ లోని మెట్టుగడ్డ ఏరియాలో గల శ్రీ వేంకటేశ్వర గుడి లో దొంగతనాలు చేసినాడు, అదేవిదంగా దాదాపు మూడు రోజుల క్రితం సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దబోనాల బైపాస్ రోడ్డు ప్రక్కన గల చిన్న హోటల్ లో కూడా డబ్బులు దొంగతనం చేయగా బైరిగిని సురేష్ అనే వ్యక్తి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి సి.ఐ ఆధ్వర్యంలోని టీం నిందితుడిని ఈ రోజు సిరిసిల్ల బైపాస్ రోడ్ లోని నర్సింగ్ కాలేజ్ వద్ద పట్టుకొని పైన తెల్పిన నాలుగు దొంగతనం కేసులలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచనైనది అని పట్టణ సి.ఐ ఉపేందర్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube