సాధారణంగా బైక్ రైడ్( Bike ride ) చేసేవారు హెల్మెట్ ధరించడానికి అస్సలు ఇష్టపడరు.దానిని ఒక మోత బరువుగా భావిస్తారు.
హెల్మెట్ లేని ప్రయాణం ఎంతో ప్రమాదకరమని పోలీసులు చెప్పినా, భారీ ఫైన్స్ విధిస్తున్నా జనాల్లో మాత్రం మార్పు రావడం లేదు.హెల్మెట్ ధరించని వారు ఒక రకమైతే, వెరైటీ హెల్మెట్లు ధరించి షాక్ ఇచ్చేవారు మరొక రకం.ఇటీవల బొమ్మలను పోలిన హెల్మెట్లు ధరించి కొందరు వైరల్ అయిన సంగతి తెలిసిందే.మరికొందరు పేపర్ బ్యాగ్ తలకు తగిలించుకొని అదే తమ హెల్మెట్ అని పోజులు ఇచ్చి వైరల్ అయ్యారు.

అయితే వీరందరి కంటే మరింత క్రియేటివ్ గా ఆలోచించి ఒక వ్యక్తి తన తలకు పీవీసి పైపు( PVC pipe )ను హెల్మెట్ లాగా ధరించాడు.రెండు పీవీసీ పైపులను ఒక జాయింటర్ తో అటాచ్ చేసి దాన్నే తన తలకు తగిలించుకున్నాడు.ఆ పెద్ద పైపు సందులో నుంచి వ్యూ చూస్తూ బైక్ నడుపుతూ అతడు కనిపించాడు.ఇది చూసి మిగతా వాహనదారులు అవాక్కయ్యారు.ఇదేందయ్యా ఇది అంటూ తమ కెమెరాల్లో ఈ ఫన్నీ రైడర్‌ను వీడియో తీశారు.అది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

@Gamingchannel11 ట్విట్టర్ ( Twitter )పేజీ షేర్ చేసిన ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెళ్లడం చూడవచ్చు బైక్ రైడ్ చేస్తున్న వ్యక్తి తలకు పీవీసీ పైపు ఉండటం కూడా గమనించవచ్చు. ఆ రైడర్ హెవీ ట్రాఫిక్ లో ఆ పైపు తలకు తగిలించుకుని వెళ్ళిపోతూనే ఉన్నాడు.ఈ వీడియోకు ఇప్పటికే వేళల్లో లైక్స్ వచ్చాయి.దీనిని మీరు కూడా చూసేయండి.







