‘విక్‌సిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’ ను జిల్లాలో ప్రభావవంతంగా జరిగేలా చూడాలి - కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించడం, పథకాలు అర్హులకు అందేలా తెలియజేయడానికి రూపొందించిన కార్యక్రమమే వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర అని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారంలో భాగంగా నిర్వహించే ‘విక్‌సిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’ ను జిల్లాలో విజయవంతం చేసేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలనీ అన్నారు.

 Viksit Bharat Sankalp Yatra Should Be Made Effective In The District Collector A-TeluguStop.com

కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హల్ లో జిల్లాలో ఈ నెల 15 వ తేదీ నుండి వచ్చే నెల జనవరి 15 వరకూ చేపట్టనున్న విక్‌సిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’ అవగాహన , ఎన్ రోల్ మెంట్ పై జిల్లా కలెక్టర్ సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు.

అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ యాత్ర నిర్వహణ కోసం జిల్లాకు మూడు వాహనాలను కేటాయించారని అన్నారు.కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాల ప్రచార వాహనాలను జిల్లాలోని గ్రామ గ్రామాన, పంచాయతీలు,మునిసిపాలిటీలు అనే తేడా లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ తెలియజేసేలా చేయాలన్నారు.

ఈ కార్యక్రమానికి నోడల్‌ అధికారిగా జాయింట్ సెక్రటరీ అజయ్ గుప్తా వ్యవహరిస్తారన్నారు.ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు జిల్లాలో తమ శాఖ ద్వారా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతిని తెలిపే తాజా నివేదికలు వెంటనే సిద్ధం చేయాలన్నారు.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సిద్దం చేయాలన్నారు.శానీ టేష్ న్, ఓడిఎఫ్ పై విద్యార్థులకు వ్యసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు.లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రభుత్వ పథకాల లబ్దిదారుల తో క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు .వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ , పశుసంవర్ధక , మున్సిపల్ అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పై తాజా ప్రగతి నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు.ఈ సమావేశంలో జిల్లా ఇంఛార్జి అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి,డి ఆర్ డి ఓ నక్క శ్రీనివాస్,ఐ డి ఎం మల్లిఖార్జున్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube