సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత వివాదాలు ఉండటం సర్వసాధారణం.అయితే ఈ ఏడాదిలో కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలు మధ్య జరిగినటువంటి వివాదాలు మొత్తం ఇండస్ట్రీని షేక్ చేశాయని చెప్పాలి.మరి ఈ ఏడాది వివాదాల ద్వారా వార్తల్లో నిలిచినటువంటి సెలబ్రిటీలు ఎవరు అనే విషయానికి వస్తే.
బాలకృష్ణ:
బాలకృష్ణ ఈ ఏడాది మొదట్లో వీర సింహారెడ్డి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన అక్కినేని తొక్కినేని అంటూ కామెంట్లు చేయడంతో పెద్ద ఎత్తున వివాదంగా మారింది.ఈ వివాదంపై అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలకృష్ణ ( Balakrishna ) క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్లు చేశారు.
ఇలా ఈ వివాదం ద్వారా బాలయ్య వార్తలలో నిలిచారు.అదే విధంగా చంద్రబాబు నాయుడు అరెస్టు అయినప్పుడు ఎన్టీఆర్( NTR ) గురించి ఐ డోంట్ కేర్ అని మాట్లాడటంతో ఆ సమయంలో కూడా ఎన్టీఆర్ అభిమానులు బాలయ్య పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్:
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బ్రో సినిమా సమయంలో రాజకీయపరమైనటువంటి వివాదాలు తలెత్తాయి.ఇందులోని ఓ సన్నివేశాన్ని ఏపీ మంత్రి అంబంటి రాంబాబును ఉద్దేశించే మాట్లాడారు అంటూ ఈ సినిమా పట్ల అప్పట్లో పెద్ద ఎత్తున వివాదంగా మారింది.ఇలా ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ కూడా వార్తల్లో నిలిచారు.

సమంత:
సమంత( Samantha ) మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నటువంటి తరుణంలో ప్రముఖ నిర్మాత చిట్టిబాబు(Chitti Babu) ఆమెను ఉద్దేశిస్తూ.సమంత బాధపడుతున్నటువంటి మయోసైటిస్ వ్యాధి ఒక సాధారణమైనటువంటి వ్యాధి కానీ ఆమె ప్రతి సినిమా విడుదలకు ముందు ఆ వ్యాధిని అడ్డుపెట్టుకొని పెద్ద ఎత్తున సింపతి కొట్టేస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ఈయన వ్యాఖ్యలపై సమంత కూడా ఘాటుగా స్పందించారు దీంతో సమంత చిట్టిబాబు కూడా వార్తల్లో నిలిచారు.

అనసూయ:
అనసూయ విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య తరచూ వివాదాలు జరుగుతూ ఉంటాయి అయితే ఈ ఏడాది ఖుషి సినిమా విడుదలకు ముందు ప్రమోషన్లలో భాగంగా ది విజయ్ దేవరకొండ అనే ఉన్నటువంటి పోస్టర్ పై అనసూయ( Anasuya ) చేసినటువంటి కామెంట్లు వైరల్ అయ్యాయి.ఈ వ్యాఖ్యలపై విజయ అభిమానులు ఈమెను భారీగా ట్రోల్ చేయడంతో అనసూయ కూడా వివాదాలలో నిలిచారు.

మంచు బ్రదర్స్:
మంచు మనోజ్(Manoj) విష్ణు (Vishnu) మధ్య గొడవలు ఉన్నాయి అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.కానీ బహిరంగంగా మంచు మనోజ్ విష్ణు గొడవ పడుతూ తిట్టుకున్నటువంటి సంఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో ఏకంగా న్యూస్ ఛానల్ లో కూడా ప్రసారమైంది అయితే మోహన్ బాబు ఇన్వాల్వ్ కావడంతో ఈ విషయం అక్కడితో ముగిసిపోయింది.
ఇలా ఈ సెలబ్రిటీ లందరూ కూడా పలు వివాదాల కారణంగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారని చెప్పాలి.







