యానిమల్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన జయప్రకాశ్ నారాయణ్.. చంపేయాలనే భావన కలుగుతుందంటూ?

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన యానిమల్ మూవీ( Animal movie ) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తుండగా ఈ సినిమాలోని కొన్ని సీన్ల విషయంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.యానిమల్ సినిమా గురించి లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

 Jayaprakash Narayan Shocking Comments About Animal Movie Details Here Goes Viral-TeluguStop.com

జయప్రకాశ్ నారాయణ్( Jayaprakash Narayan ) మాట్లాడుతూ సినిమాల వల్ల మనుషులు మారిపోరని చెడిపోరని అన్నారు.

కానీ మనుషులు ఆలోచించే విధానంపై మాత్రం సినిమాలు ప్రభావం చూపుతాయని చెప్పుకొచ్చారు.

సినిమా మేకర్స్ కు సైతం సమాజం విషయంలో బాధ్యత ఉండాలని ఆయన కామెంట్లు చేశారు.సినిమాల ద్వారా మంచి ఆలోచనలు కలిగేలా చేయకపోయినా పరవాలేదని చెడు ఆలోచనలు కలిగే విధంగా మాత్రం సినిమాలను తెరకెక్కించకూడదని జయప్రకాశ్ నారాయణ్ చెప్పుకొచ్చారు.

Telugu Animal, Jayaprakash Yan, Sandeepreddy, Tollywood-Movie

సమాజంలో జరిగే తప్పులకు పూర్తి బాధ్యత సినిమాలు అనడం లేదని అలా అనడం కూడా తప్పు అని ఆయన కామెంట్లు చేశారు.ఎంటర్టైన్మెంట్ తో పాటు సమాజంపై బాధ్యత వహించి సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుందని జయప్రకాశ్ నారాయణ్ తెలిపారు.శివ, యానిమల్( Shiva, Animal ) సినిమాలను చూస్తే నాకైతే ఎదుటివాడిని చంపేయాలనే భావన కలుగుతుందని ఆయన కామెంట్లు చేశారు.

Telugu Animal, Jayaprakash Yan, Sandeepreddy, Tollywood-Movie

చిన్న పిల్లలపై ఆ సినిమాలు మరింత ప్రభావం చూపిస్తాయని జయప్రకాశ్ నారాయణ్ అన్నారు.ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని సినిమాలను తెరకెక్కించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.జయప్రకాశ్ నారాయణ్ చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

జయప్రకాశ్ నారాయణ్ కామెంట్ల గురించి సందీప్ రెడ్డి వంగా ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.తన సినిమా గురించి వ్యక్తమవుతున్న నెగిటివ్ కామెంట్ల విషయంలో ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది.

యానిమల్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube