బీఆర్ఎస్ నేతలను టెన్షన్ పెట్టే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) దూకుడుగా ముందుకు వెళుతున్నారు.గత బిఆర్ఎస్( BRS ) ప్రభుత్వ పాలనలో చోటు చేసుకున్న అన్ని అవినీతి అక్రమాలను వెలికి తీయడమే లక్ష్యంగా రేవంత్ ముందుకు వెళ్తున్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు హోదాలో అప్పటి ప్రభుత్వ అవినీతి అక్రమాలపై రేవంత్ పోరాటాలు చేశారు.ఇప్పుడు ఆ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో విచారణ చేయించి, నిజాలను వెలికి తీసి ప్రజల్లో బీఆర్ఎస్ ను దోషిగా నిలబెట్టాలి అనే వ్యూహంతో రేవంత్ ఉన్నారు.
ఈ పరిణామాలన్నీ బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన పెంచుతున్నాయి.

రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గా బాధ్యతలు స్వీకరించి వారం అవుతుంది.అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, ఇతర విషయాలపై పూర్తిస్థాయిలో శ్వేత పత్రాలను సమర్పించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు.
ఇదేవిధంగా కాలేశ్వరం ప్రాజెక్టుతో( Kaleshwaram Project ) పాటు, అనేక పనుల్లో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటిపై విచారణ చేయించాలని నిర్ణయించారు.ఈ వ్యవహారాలన్నీ బిఆర్ఎస్ కు ఆందోళన కలిగిస్తున్నాయి.
దీంతో ఇప్పుడు ఎదురుదాడికి బీఆర్ఎస్ నేతలు దిగుతున్నారు.ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) మీడియాతో మాట్లాడిన సందర్భంగా ప్రభుత్వ శ్వేత పత్రాలపై స్పందించారు.

కాగ్ రిపోర్టులు, ఆడిట్ రిపోర్టులు ఉన్నాయని, వాటికంటే శ్వేత పత్రాల్లో ఏముంటాయని ప్రశ్నించారు.బీఆర్ఎస్ పై విషం చిమ్మెందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.వారంలో రుణమాఫీ అన్నారని ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు.ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అని, వదిలేది లేదు అంటూ హెచ్చరించారు.ఇక మరో నేత హరీష్ రావు( Harish Rao ) ఈ వ్యవహారంపై స్పందించారు.కెసిఆర్ లో పనితనమే ఉందని పగతనం లేదని, కక్ష సాధింపులకు పాల్పడి ఉంటే చాలామంది కాంగ్రెస్ నేతలు జైలులో ఉండే వారిని హరీష్ రావు వ్యాచనించారు.







