తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభవన్ ను కేటాయించింది.ఈ మేరకు భవనాన్ని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రగతిభవన్ గా ఉన్న ఈ భవనాన్ని కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తరువాత ప్రజా భవన్ గా మార్చిన సంగతి తెలిసిందే.తాజాగా డిప్యూటీ సీఎం భట్టికి అధికారిక నివాసంగా కేటాయింపు అయింది.