మూసీనది తీర ప్రాంతాలు పర్యాటకాలు...?

నల్లగొండ జిల్లా: తెలంగాణలో సంచలన నిర్ణయాలతో సీఎం రేవంత్ రెడ్డి తమదైన స్టైల్ లో మార్క్ పాలన ను కనబరుస్తున్నారు.సర్కారు కొలువుదిరిన రోజు నుంచి ఆయా శాఖల అధి కారులతో వరుసగా రివ్యూలు నిర్వహిస్తూ కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు.

 Cm Revanth Reddy To Develop Musi River Coastal Areas As Touristic Places, Cm Rev-TeluguStop.com

ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి తన మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌‌ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు మీ దగ్గరున్న ప్లాన్ ఏంటని ఓ న్యూస్ ఛానల్ యాంకర్ అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయ్యింది.

అప్పడు ట్రోల్ అయిన తన ప్లాన్‌నే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసి చూపేందుకు సిద్ధమవుతున్నారు.హైదరాబాద్ మహానగరంలో మూసినది ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి చివరి వరకు మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని మొత్తం ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు.

మొత్తం మూసీ పరీవాహక ప్రాంతాన్ని పర్యా టకులను ఆకర్షించే విధంగా స్వీయ ఆర్థిక చోదక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

ఇందుకు గానూ మూసీ నదీ వెంట బ్రిడ్జిలు,కమర్షియల్,షాపింగ్ కాంప్లెక్సులు, అమ్యూజ్‌మెంట్ పార్కులు,హాకర్ జోన్లు, పాత్-వేలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో నిర్మించే విధంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube