నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైంది.ఈ మేరకు మున్సిపల్ ఛైర్ పర్సన్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ల సమావేశం జరిగింది.
ఈ క్రమంలోనే సుమారు 26 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ ను కలిశారని తెలుస్తోంది.మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీతపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ కలెక్టర్ కు బీఆర్ఎస్ కౌన్సిలర్లు విన్నవించారని సమాచారం.