ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయితో కలిసి గ్రామం విడిచి వెళ్లిపోవడంతో.ఆ అమ్మాయి కుటుంబీకులు ఆ యువకుడు తల్లిని వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించి అత్యంత దారుణంగా అవమానించిన ఘటన కర్ణాటకలో( Karnataka ) చోటుచేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.
కర్ణాటకలోని బెళగావి( Belagavi ) జిల్లాలోని న్యూ వంటమూరి గ్రామంలో నివాసం ఉంటున్న అశోక్ (24)( Ashok ) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ప్రియాంక (18)( Priyanka ) అనే అమ్మాయి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.అయితే ప్రియాంకకు వేరే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేశారు ఆమె కుటుంబ సభ్యులు.

నిశ్చితార్థానికి కొన్ని రోజుల ముందు ఆదివారం అర్ధరాత్రి సుమారుగా 12 గంటల సమయంలో ఈ ప్రేమికులు గ్రామం విడిచి వెళ్లిపోయారు.ఈ విషయం ప్రియాంక కుటుంబ సభ్యులకు తెలియడంతో.అదే రోజు రాత్రి అశోక్ ఇంటిపై దాడి చేశారు.అశోక్ తల్లిని విచక్షణారహితంగా కొట్టి, ఆమెను నగ్నంగా గ్రామంలో ఊరేగించారు.తర్వాత గ్రామంలో ఉండే ఒక కరెంటు స్తంభానికి కట్టేసి, విచక్షణ రహితంగా కొట్టారు.సోమవారం తెల్లవారుజామున సుమారుగా నాలుగు గంటల సమయంలో గ్రామస్తులు పోలీసులకు ( Police ) సమాచారం అందించారు.
పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి స్తంభానికి కట్టేసి ఉన్న మహిళను విడిపించి, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనతో సంబంధం ఉన్న ఏడుగురు వ్యక్తులను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు గ్రామస్తులను విచారించగా అశోక్, ప్రియాంకలు ఒకే కులానికి చెందిన వారే కానీ వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదని, అందుకే ఈ ప్రేమికులు అర్థరాత్రి గ్రామం విడిచి వెళ్లిపోయారని పోలీసులకు తెలిపారు.గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఆ గ్రామానికి అదనపు భద్రతను కల్పించారు.
ఈ ఘటన గురించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు( CM Siddaramaiah ) తెలియడంతో ఆయన తీవ్రంగా ఖండించడంతోపాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.








