ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ( AP Assembly Elections )దగ్గర పడుతున్నవేళ రాష్ట్ర రాజకీయాలలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యంగా రెండో సారి అధికారమే లక్ష్యంగా ఉన్న వైసీపీకి గట్టి షాకులు తగులుతున్నాయి.
గత కొన్నాళ్లుగా వైసీపీలో( YCP ) అంతర్గత కుమ్ములాటలు గట్టిగానే జరుగుతున్నాయి.ఆ మద్య ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వంటి వారు పార్టీలో ఇమడలేక గుడ్ బై చెప్పి బయటకు వచ్చారు.
ఇక వీరి దారిలోనే మరికొంత మంది ఎమ్మేల్యేలు బయటకు వస్తారని దాదాపు 40 మంది ఎమ్మేల్యేలు పార్టీ విడేందుకు సిద్దంగా ఉన్నారని గత కొన్నాళ్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.పార్టీ నుంచి బయటకు వచ్చిన వారు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తు వచ్చారు.
క తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణరెడ్డి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పడంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంలో ఎన్నికల ముందు వైసీపీలో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.అయితే బయటకు వచ్చినవారంతా కూడా జగన్( jagan ) పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తు వ్యతిరేకత చూపుతుండడం గమనార్హం.అయితే వైసీపీ ఎమ్మేల్యేలు ఒక్కొక్కరుగా ఎందుకు పార్టీ వీడుతున్నారనే దానిపై విశ్లేషకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ప్రజల్లో పార్టీపై వ్యతిరేకతను గమనించి పార్టీ వీడుతున్నారని కొందరు చెబుతుంటే.
జగన్ నియంతృత్వ పోకడలు నచ్చక పార్టీ వీడుతున్నారని మరికొందరు చెబుతున్నారు.
ఇక వైసీపీ నుంచి బయటకు వచ్చిన వారికి టీడీపీ( TDP ) వైపు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు చంద్రబాబు.దీంతో ముందు రోజుల్లో చంద్రబాబు ఎత్తుగడల కారణంగా వాసిపి నుంచి వలస వచ్చే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.మొత్తానికి ఎన్నికల ముందు మాత్రం వైసీపీని అంతర్గత సమస్యలు గట్టిగానే చుట్టుముట్టినట్లు తెలుస్తోంది.
మరి వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో విజయమే లక్ష్యంగా ఉన్న వైఎస్ జగన్ పార్టీలోని సమస్యలను ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బయటకు వస్తుండడంతో ముందు రోజుల్లో ఈ సంఖ్య పెరుగుతుందా ? లేదా పార్టీ;లోని లొసుగులను పరిష్కరించి కొత్త జోష్ తో జగన్ ముందుకు వెళతారా అనేది చూడాలి.