New York Fraud Trial: చెప్పాల్సినదంతా చెప్పాను, ఇంకేం లేదు : ఇకపై సాక్ష్యమివ్వనన్న డొనాల్డ్ ట్రంప్

రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్‌ను( Donald Trump ) న్యాయపరమైన ఇబ్బందులు, కోర్టు కేసులు చికాకు పరుస్తున్నాయి.తన ‘‘ హై స్టేక్స్ ఫ్రాడ్ ’’ కేసు( High Stakes Fraud ) విచారణలో రెండవసారి స్టాండ్ తీసుకోనని ఆయన ఆదివారం ప్రకటించారు.

 Donald Trump Cancels Plans To Testify At New York Fraud Trial-TeluguStop.com

విచారణ దశలు ముగియడంతో సోమవారం ట్రంప్.కోర్టు ఎదుట హాజరుకావాల్సి వుంది.

అయితే అనూహ్యంగా ఇకపై తాను సాక్ష్యం చెప్పనని తన ట్రూత్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో వెల్లడించాడు.ఈ మొత్తం కేసు.

వచ్చే ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ఉద్దేశించిన మంత్రగత్తె వేట వంటిదని ట్రంప్ అభివర్ణించారు.

Telugu Donald Trump, Fraud, Judgearthur, Letitia James, Mar Lago, York, York Gen

నవంబర్ 6న కొంత వివాదాస్పద సాక్ష్యం తర్వాత ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇక్కడ ఆయన ప్రతిస్పందనలు ఓ రాజకీయ ర్యాలీని పోలినట్లుగా వుంటాయి.అయితే ట్రంప్ సంస్థ మోసానికి పాల్పడిందని ఇప్పటికే న్యాయమూర్తి ఆర్ధర్ ఎంగోరాన్( Judge Arthur Engoron ) తీర్పు వెలువరించగా, శిక్షను ఖరారు చేసే పనిలో వున్నారు.

న్యూయార్క్ అటార్నీ జనరల్ .లెటిటియా జేమ్స్( Letitia James ) మాట్లాడుతూ.ట్రంప్ తన కుమారులు , ఇతర కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు అనుకూలమైన రుణ నిబంధనలను పొందేందుకు ఉద్దేశపూర్వకంగా వారి ఆస్తుల విలువను పెంచారని వాదించారు.అయితే గడిచిన కొన్ని వారాలుగా ట్రంప్ డిఫెన్స్ లాయర్లు ఈ వాదనను తిప్పికొట్టేందుకు ప్రయత్నించారు.

తన ఆస్తులకు తగిన విలువను ఇచ్చే హక్కు మాజీ అధ్యక్షడికి వుందన్నారు.

Telugu Donald Trump, Fraud, Judgearthur, Letitia James, Mar Lago, York, York Gen

అటు ట్రంప్ సైతం న్యాయమూర్తి ఎంగోరాన్, అటార్నీ జేమ్స్‌లపై తన ట్రూత్ సోషల్ ద్వారా ఎదురుదాడికి దిగారు.తన ఆస్తులను వారు భారీగా తగ్గించారని , ప్రాసిక్యూషన్ చెబుతున్న మార్ ఏ లాగో విలువ 18 మిలియన్ డాలర్లు కాదని అంతకుమించి 50 నుంచి 100 రెట్లు వుంటుందని చెప్పారు.కోర్టుకు వాంగ్మూలం ఇచ్చే సమయంలో ట్రంప్, అతని కుమారులు ఆర్ధిక నివేదికల గురించి నిర్దిష్ట వివరాలను గుర్తుచేసుకోవడంలో పదే పదే ఇబ్బందిపడ్డారు .ఈ అభియోగాలపై ట్రంప్‌కు కనీసం 250 మిలియన్ డాలర్ల జరిమానా విధించే అవకాశం వుందని న్యాయ నిపుణులు అంటున్నారు.దీనికి అదనంగా ప్రీ ట్రయల్ తీర్పును అప్పీల్ కోర్ట్ సమర్ధిస్తే.

ట్రంప్ అతని కుమారులు న్యూయార్క్‌లో వ్యాపారం చేయకుండా నిషేధించబడతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube