కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు.ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పినా మాజీ మంత్రులు తీరును మార్చుకోవడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు.
అలాగే మిగిలిన హామీలను కూడా వంద రోజుల్లోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.







