విక్టరీ వెంకటేష్ నటించిన 75వ చిత్రం సైంధవ మూవీ( Saindhav Movie ) చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడలో ఒక ప్రముఖ హోటల్లో సందడి చేసిన చిత్ర బృందం.సైంధవ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరో విక్టరీ వెంకటేష్, హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్, దర్శకుడు శైలేష్ కొలను, నిర్మాత వెంకట్ బోయినపల్లి, నూతన నటి బేబీ సారా.
జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్న సైంధవ చిత్రం.సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల కానున్న సైంధవ.
హీరో విక్టరీ వెంకటేష్( Venkatesh ) కామెంట్స్,సైంధవ మూవీ కొత్త కథ, కథనం తో తెరకెక్కనుంది…ఈ చిత్రంలో యాక్షన్ ,ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు మేచ్చే విధంగా ఉండబోతుంది.దర్శకుడు శైలేష్( Sailesh Kolanu ) స్టోరీ చెప్పగానే చిత్రం ఒప్పుకున్నాను…
హీరోయిన్ శ్రద్ధ( Shraddha Srinath ) ఈ చిత్రంలో చాలా బాగా నటించింది.
ప్రేక్షకులు మెచ్చితే సైంధవ 2 కూడా తీస్తాము….చాలా సంవత్సరాల తర్వాత ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నాను.
బాబాయ్ హోటల్ లో టిఫిన్ చేశాను.చాలా సంతోషంగా అనిపించింది…జనవరి 13 సంక్రాంతిన ఈ చిత్రం విడుదల కానుంది, ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మరిన్ని మల్టీస్టార్ చిత్రాల్లో నటించే అవకాశం ఉంది.దర్శకుడు శైలేష్ కొలను కామెంట్స్,హిట్, హిట్టు టు ఘనవిజయాల తర్వాత ఈ చిత్రం కూడా అదే స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నాను.
యాక్షన్ సెంటిమెంటుతో ఈ చిత్రం తెరకెక్కనుంది.హీరో విక్టరీ వెంకటేష్ గారి 75వ చిత్రం నేను తీయడం చాలా సంతోషంగా ఉంది.
ఎవరో చూడని కొత్త విక్టరీ వెంకటేష్ ని మీరు ఈ చిత్రం ద్వారా చూడబోతున్నారు.ఈ చిత్రంలో సంగీతం పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ప్రేక్షకులందరూ జనవరి 13వ తేదీన,సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని చూడాలని కోరుకుంటున్నాను.