మనిషి చెడు అలవాట్ల బారిన పడితే మానవత్వం మరిచి ఎలాంటి తప్పులు చేయడానికి అయినా వెనుకాడడు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.తాగుడుకు బానిసైన ఒక వ్యక్తి డబ్బుల కోసం కూతురు ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డ ఘటన కడప జిల్లా( Kadapa district ) ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
పొద్దుటూరు( Proddatur )లోని సూపర్ బజార్ రోడ్డు లో ఉండే నాగుల కట్ట వీధిలో గురుప్రియ, గురు నాయక్ అనే దంపతులు నివాసం ఉంటున్నారు.అయితే గురుప్రియ తండ్రి గురుశేఖర్ తాగుడుకు బానిసై సొంత గ్రామంలో అప్పులు చేసి, అప్పుల బాధతో ఆ గ్రామంలో ఉండలేక కొన్ని రోజుల క్రితం కూతురి ఇంటికి వచ్చాడు.

అయితే శుక్రవారం గురుప్రియ తన పసికందును తండ్రికి ఇచ్చి ఒక పని మీద బయటకు వెళ్ళింది.పని ముగించుకుని ఇంటికి వచ్చిన గురుప్రియకు తన తండ్రి కనిపించలేదు.ఇంట్లో డబ్బులతో పాటు సెల్ఫోన్ కూడా కనిపించకపోవడంతో ఆ వీధి మొత్తం గాలించింది.చివరికి బంధువుల ఇళ్లకు వెళ్లి ఆరా తీసింది.అయినా తండ్రి జాడ తెలియకపోవడంతో చివరికి భర్తతో పాటు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, సాంకేతికత సహాయంతో గురుశేఖర్ ను రాజంపేటలో ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
అతని వద్ద ఉండే పసికందును ఆమె తల్లి వద్దకు సురక్షితంగా చేర్చారు.

పోలీసుల( Police ) విచారణలో గురుశేఖర్ మద్యానికి బానిసై మద్యం తాగినందుకు డబ్బు, సెల్ ఫోన్ తీసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు.అయితే పసికందును ఇంట్లో ఒంటరిగా వదిలేస్తే ప్రమాదమని తనతోపాటు మనవరాలిని కూడా తీసుకెళ్లాడు.తమ కుమార్తెను సురక్షితంగా తమ వద్దకు చేర్చడంతో గురుప్రియ దంపతులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.







