Bandla Ganesh : ఎన్టీఆర్ తో గ్యాప్ గురించి మరోసారి నోరు విప్పిన బండ్ల గణేష్.. మరో సినిమా చేస్తానంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ( Bandla Ganesh )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బండ్ల గణేష్ సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా బాగా హైలైట్ అయిన విషయం తెలిసిందే.

 Tollywood Producer Bandla Ganesh Comments About Conflict Ntr-TeluguStop.com

రాజకీయాలకు సంబంధించిన విషయాలలోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.అయితే మొదట యాక్టర్ గా కెరియర్ ను ప్రారంభించిన బండ్ల గణేష్ 2009లో రవితేజ హీరోగా నటించిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే.

ఇక రెండు సినిమాని ఏకంగా పవన్ కళ్యాణ్ తోనే నిర్మించారు.

Telugu Bandla Ganesh, Jr Ntr, Temper, Tollywood-Movie

తీన్‌మార్ మూవీతో ప్లాప్ ని అందుకున్న బండ్ల గణేష్ మూడో సినిమా గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ హిట్టుని అందుకున్నారు.ఆ తరువాత ఎన్టీఆర్‌తో బాద్‌షా, అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలతో, రామ్ చరణ్‌తో గోవిందుడు అందరివాడేలే సినిమాలు తెరకెక్కించారు.చివరిగా ఎన్టీఆర్‌తో టెంపర్ సినిమా( Temper )ను తెరకెక్కించారు.

ఆ సినిమా మంచి విజయం సాధించింది.కానీ ఆ మూవీ తరువాత మరో సినిమాని నిర్మించలేదు.

ఆ మూవీ సమయంలో రచయిత వక్కంతం వంశీ( Vakkantham Vamsi ) రెమ్యూనరేషన్ విషయంలో బండ్ల గణేష్ కోర్టు వరకు వెళ్లారు.ఈ గొడవ వల్లే ఎన్టీఆర్, బండ్ల గణేష్ మధ్య కూడా గ్యాప్ వచ్చిందని కూడా వార్తలు జోరుగా వినిపించాయి.

Telugu Bandla Ganesh, Jr Ntr, Temper, Tollywood-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ విషయం గురించి బండ్ల గణేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.ఎన్టీఆర్‌కి, నాకు మధ్య ఎలాంటి విబేధాలు లేవు.టెంపర్ తరువాత కూడా నేను ఆయనను చాలాసార్లు కలిశాను అని తెలిపారు బండ్ల గణేష్.ప్రస్తుతం ఎన్టీఆర్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అయ్యిపోయారు.ఆయనతో నాకు ఏమి విబేధాలు ఉంటాయి.అలాగే మళ్ళీ ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేస్తాను అని చెప్పుకొచ్చారు.

టెంపర్ తరువాత కూడా నేను నిర్మాతగా గ్యాప్ తీసుకోవాలని అనుకున్నాను.కానీ ఆ గ్యాప్ కాస్త ఇప్పటివరకు మరో సినిమా తీయనంతగా మారుతుందని అనుకోలేదు అని తెలిపారు బండ్ల గణేష్.

ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్ట్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి.స్టోరీ, హీరో ఫైనల్ అవ్వగానే ప్రకటించనున్నట్లు బండ్ల గణేష్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube