జంతువులకు ( Animals ) మాట రాదు కానీ వాటికి కూడా మనసు ఉంటుంది.గాయపరిచితే అవి కూడా చాలా పెయిన్ అనుభవిస్తాయి.
ఎవరికీ చెప్పుకోలేని ఈ మూగజీవులు వాటిలో అవే ఎంతో కుమిలిపోతూ లైఫ్ గడుపుతాయి.అందుకే వాటికి ఆహారం పెట్టకపోయినా పర్లేదు కానీ హింసించవద్దని చాలామంది కోరుతుంటారు.
అయితే మానవత్వం ఏ మూలనా కనిపించని కొందరు కిరాతకులు వాటిని ఘోరంగా హింసిస్తారు.వారి హింస చూసినప్పుడు వారు మూగ జంతువులను ఎంత హింసించారో అదే స్థాయిలో హింసించాలన్నంత కోపం చాలామందికి వస్తుంటుంది.
అయితే అంత రిస్కు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రారు.కొందరు మాత్రమే ఇలాంటి వారిని ఫేస్ చేసి తగిన బుద్ధి చెప్తారు.
తాజాగా ఆ తరహా వ్యక్తికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వైరల్ వీడియోలో తాషాన్ రోడ్రిగ్జ్ అనే ఒక వ్యక్తి న్యూయార్క్( Newyork ) వీధిలో ఒక కుక్క యజమాని మెడలో గొలుసు వేయడం మనం చూడవచ్చు.
దానికి ఒక కారణం ఉంది ఆ స్టోరీ తెలుసుకుంటే, ఈ కుక్క యజమాని ప్రాడా అనే పిట్బుల్ను( Pitbull ) పెంచుకుంటున్నాడు.కానీ అతనొక కిరాతకుడు.దానిని కాపాడాల్సిన అతడే దానికి యముడై కూర్చున్నాడు.ఒకానొకరోజు తన కుక్క మెడలో గొలుసు వేసి రోడ్డుపై చాలా దూరం లాక్కెళ్లాడు.
దీనివల్ల కుక్క మొహం రోడ్డుకి గీసుకుపోయి రక్తం వచ్చింది.ఆ బాధతో కుక్క ఎంతో బాధపడింది.
కుక్కను బాధ పెడుతున్న యజమానిని చూసి రోడ్రిగ్జ్ ఎంతో కోపానికి గురయ్యాడు.

రోడ్రిగ్జ్ ( Rodriguez ) మొదటగా ప్రాడా కుక్కను వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లి చికిత్స ఇప్పించాడు.ఫుడ్ పెట్టి, వాకింగ్ కి తీసుకెళ్తూ దానికి మళ్లీ మంచి లైఫ్ ఇచ్చాడు.అనంతరం ఆ కుక్కను బాధపెట్టిన యజమానికి తగిన గుణపాఠం నేర్పించాలని భావించాడు.
ఒకరోజు మనిషి మెడకు సరిపోయే గొలుసు కొనుగోలు చేశాడు.అదే గొలుసును( Chain ) యజమాని మెడలో వేశాడు.
అతను ఎలా కుక్కని బాధ పెట్టాడో అదే విధంగా గొలుసుతో లాక్కుంటూ ఈ యువకుడిని బాధపెట్టాడు.

“ఇలాగే కదా నువ్వు కుక్కని హింసించింది” అని గుర్తు చేస్తూ అతడికి ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించేలా చేశాడు.ఈ దృశ్యాలను మరొక వ్యక్తి ఫోన్ కెమెరాలో రికార్డు చేశాడు.సదరు యజమాని తిరిగి కొట్టడానికి ప్రయత్నించినప్పుడు వీడియో తీస్తున్న వ్యక్తి కూడా జోక్యం చేసుకొని అతడిని కొట్టాడు.
మొత్తం మీద ఈ యువకుడికి బాగానే వారు బుద్ధి చెప్పారు.@BestFightClip ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియోకు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి.చాలామంది ఈ యువకుడిని ఇంకా కొడితే బాగుండు అని కామెంట్లు చేశారు.దీనిని మీరు కూడా చూసేయండి.https://twitter.com/BestFightClip/status/1731713875014209752?t=ZwepCnDM2owABvRXEE7l1Q&s=19 ఈ లింకు విజిట్ చేయడం ద్వారా వీడియోను మీరు చూడవచ్చు.