ప్రసుతం పెట్రోల్ రేట్లు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి.తెలుగు రాష్ట్రాలలో లీటర్ పెట్రోల్ 110 రూపాయలకు అటూఇటుగా ఉంది.
లీటర్ డీజిల్ 100 రూపాయలకు అటూఇటుగా ఉంది.అయితే కేవలం 8 రూపాయల ఖర్చుతో 30 కిలోమీటర్ల ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంది.
అస్సాం రాష్ట్రానికి( Assam ) విద్యార్థి వండర్ బైక్ ను తయారు చేశాడు.మస్కుల్ ఖాన్( Maskul Khan ) అనే విద్యార్థి వినూత్న ఈ బైక్ ను తయారు చేశాడు.
పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే విధంగా తయారు చేసిన ఈ బైక్ కు వండర్ బైక్ 250( Wonder Bike 250 ) అనే పేరు పెట్టగా ఈ బైక్ పై కేవలం 8 రూపాయల ఖర్చుతో 30 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు.80 నుంచి 100 కిలోల బరువును ఈ వండర్ బైక్ మోయగలదు.ఈ వండర్ బైక్ బరువు కేవలం 30 కిలోలు కావడం గమనార్హం.ఈ బైక్ లో ఉన్న బ్యాటరీని కేవలం 5 గంటల సమయంలో ఛార్జ్ చేయడం సాధ్యమవుతుంది.
కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ సమయంలో ఇంటికే ఇంటికే పరిమితమైన మస్కుల్ ఖాన్ ఆ సమయంలో ఈ సైకిల్ ను తయారు చేయడం జరిగింది.భవిష్యత్తులో మస్కుల్ ఖాన్ ఈ కార్ ను( e-Car ) తయారు చేయాలని భావిస్తున్నారు.మస్కుల్ ఖాన్ భవిష్యత్తులో ఈ కలను నెరవేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మస్కుల్ ఖాన్ కు తండ్రినుంచి సైతం తన వంతు సపోర్ట్ లభిస్తుందని తెలుస్తోంది.
మస్కుల్ ఖాన్ తయారు చేసిన బైక్ పూర్తిస్థాయిలో బ్యాటరీతో పని చేస్తోంది.ఈ బైక్ మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.తేజ్పూర్ సీరియల్ ఇన్నోవేటర్ బ్యాటరీతో ఈ బైక్ పని చేస్తుందని సమాచారం అందుతోంది.మన్సుల్ ఖాన్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.