2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు .. బైడెన్‌పై ట్రంప్‌దే ఆధిక్యం, తాజా సర్వేలో సంచలన విషయాలు

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందడి అమెరికాలో తారాస్థాయికి చేరుతోంది.ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌తో( President Joe Biden ) పాటు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌( Donald Trump ) సహా రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీల నుంచి పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

 Donald Trump Stakes 4-point Lead Over Joe Biden In 2024 Presidential Race Polls-TeluguStop.com

ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పలు సర్వేలు వెలువుడుతున్నాయి.తాజా సర్వే ప్రకారం వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌పై ట్రంప్ ఆధిక్యంలో వున్నారట.

శనివారం విడుదలైన వాల్ స్ట్రీట్ జర్నల్( Wall Street Journal ) సర్వే ప్రకారం.ట్రంప్ 4 పాయింట్లతో ముందంజలో వున్నారు.బైడెన్‌కు 43 శాతం రేటింగ్ వుండగా… ట్రంప్ 47 శాతం వద్ద వున్నారు.2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ట్రంప్, బైడెన్ మధ్య పోటీలో ట్రంప్ ఆధిక్యంలోకి రావడం ఇదే తొలిసారి.

అధ్యక్షుడిగా బైడెన్ అప్రూవల్ రేటింగ్ అత్యల్ప స్థాయికి చేరుకుందని సర్వే తెలిపింది.మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డెమొక్రాట్( Democrats ) సర్కిల్స్‌లో ఈ సర్వే భయాందోళనలు కలిగిస్తోంది.

థర్డ్ పార్టీ, స్వతంత్ర అభ్యర్ధులను పరిగణనలోనికి తీసుకుంటే వారంతా కలిసి 17 శాతం మద్ధతు పొందగా. ట్రంప్ 31 నుంచి 36 పాయింట్ల మధ్య పొందారు.

బైడెన్‌ రెండవసారి అధ్యక్షుడిగా వుండాలా , వద్దా అని అడిగితే ఆయన బరిలో నుంచి తప్పుకోవాలనే వాదనలు పెరుగుతున్నాయి.ఇందుకు ప్రధాన కారణం బైడెన్ వయసు.ఎన్నికలు జరిగే సమయానికి బైడెన్‌కు 81 ఏళ్లు వస్తే.రెండవసారి అధ్యక్షుడిగా గెలిచి దిగిపోయేనాటికి ఆయనకు 86 ఏళ్లు నిండుతాయి.

దీనికి తోడు కాలిఫోర్నియాలోని పన్ను ఆరోపణలపై బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌పై( Hunter Biden ) నేరారోపణలు .అధ్యక్షుడికి అవకాశాన్ని మరింత క్లిష్టతరం చేసింది.

Telugu Democrats, Donald Trump, Hunter Biden, Joe Biden, Republican, Presidentia

మరోవైపు.ట్రంప్( Trump ) పరిస్ధితులు కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేవు.రిపబ్లికన్ పార్టీ( Republican Party ) అభ్యర్ధుల్లో ముందంజలో వున్న ట్రంప్ పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు.2020 ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారంటూ ఆయనపై నాలుగు క్రిమినల్ కేసులతో సహా చట్టపరమైన సమస్యలు ట్రంప్ అభ్యర్ధిత్వానికి ముప్పు కలిగిస్తున్నాయి.వయసు విషయాన్ని చూస్తే ఎన్నికలు జరిగే సమయానికి డొనాల్డ్ ట్రంప్‌కు 78 ఏళ్లు నిండుతాయి.

Telugu Democrats, Donald Trump, Hunter Biden, Joe Biden, Republican, Presidentia

మరోవైపు.శుక్రవారం రాత్రి కాలిఫోర్నియాలో జరిగిన ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో ట్రంప్‌పై అధ్యక్షుడు జో బైడెన్ మండిపడ్డారు.జనవరి 6, 2021 నాటి యూఎస్ కాపిటల్ దాడిని ఆయన ప్రస్తావించారు.

ట్రంప్ ప్రవర్తన నీచమైనదని, అల్లర్ల సమయంలో మాజీ అధ్యక్షుడు నియంతలా వ్యవహరించాలని చూశారని బైడెన్ పేర్కొన్నారు.ఇజ్రాయెల్ గాజా వివాదం గురించి చర్చించకుండా ట్రంప్ తప్పించుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube