సాధారణంగా పామును చూస్తేనే మనకు ఒళ్ళు జలదరిస్తుంది.ఇక అది సమీపంలో ఉంటే చెమటలు పట్టేస్తాయి.
పాములు చాలా అనూహ్య ప్రవర్తన కలిగి ఉంటాయి.ఎవరైనా హాని చేస్తున్నారని తెలిసిన వెంటనే కాటేస్తాయి.
అందుకే వీటిని పెంపుడు జంతువులుగా ఎవరూ ఉంచుకోకూడదు కానీ ఫార్నర్స్ మాత్రం వాటిని కుక్కలు, పిల్లుల లాగా పెంచుతుంటారు.వాటిని ముద్దాడుతూ కూడా ప్రేమను చూపిస్తుంటారు.
పాములు( Snakes ) సహజసిద్ధమైన అడవి జంతువులు, వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయకపోయినా వెంటనే దాడి చేస్తాయి.ఈ ప్రమాదాలు తెలియని ఒక చిన్నారి తాజాగా ఒక పెద్ద పామును తన మెడలో వేసుకుని పడుకుంది.

అరియనా అని పిలిచే ఈ చిన్నారి తల్లి వచ్చి దుప్పటి తీయగా ఆమె పైనే పాము పడుకొని ఉంది.అయితే బాలిక నిద్రలేచి తన నుంచి దూరంగా వెళ్లిపోతున్న పామును దగ్గరికి తీసుకుంది.అనంతరం పాము తలపై నిమిరింది.దీనికి సంబంధించిన వీడియోను @snakemasterexotics ఇన్‌స్టాగ్రామ్( Instagram ) పేజీ షేర్ చేసింది.ఈ వీడియోలో కనిపించిన పాము ఒక బోలెన్స్ పైథాన్ అని పేర్కొంది.ఆ పామును చిన్నారి తన దగ్గరికి తీసుకొని ముఖంలో ముఖం పెట్టి నిమురుతున్నప్పుడు కాటేస్తుందేమో అనే భయం చూసిన వారెవరికైనా కలుగుతుంది.

కొద్ది రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకి కోటికి పైగా వ్యూస్ వచ్చాయి.దీన్ని చూసి చాలామంది షాక్ అవుతున్నారు.పిల్లలకు ఇలా పాములను అలవాటు చేయకూడదని అంటున్నారు తెలియక ఏదైనా తప్పు చేస్తే అవి దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్కేయండి.







