ఏపీలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.ఈ మేరకు చెరకూరులో పంట పొలాలను పరిశీలించారు.
ఓ వ్యక్తి అహంకారానికి రైతులు బలైపోయారని చంద్రబాబు తెలిపారు.డ్రైనేజీ, సాగునీరు, రహదారుల వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారని పేర్కొన్నారు.
గుండ్లకమ్మ గేట్లు కూడా కాపాడలేని అసమర్థ సీఎం అని తెలిపారు.ప్రాజెక్టు గేటుకు మరమ్మతులు చేయించలేని జగన్ మూడు రాజధానులు కడతానని గొప్పలు చెబుతున్నారని విమర్శించారు.
జగన్ కు ఇసుకపై ఉన్న ప్రేమ రైతులు, నీటి నిర్వహణపై లేదని ఎద్దేవా చేశారు.తుఫానుపై రైతులను అప్రమత్తం చేయలేదని వెల్లడించారు.
టీడీపీ – జనసేన గెలుపు మార్పునకు నాంది పలకాలని సూచించారు.రైతు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.







