రాజన్న సిరిసిల్ల జిల్లా :కాంగ్రెస్ పార్టీ( Congress party ) ప్రభుత్వం ఏర్పడ్డాక సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా మొదటి విడతలో భాగంగా ఉచిత బస్సును ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం మహిళలు ఉచితంగా బస్సులో ఎక్కించుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )ఆర్ స్కీముల గ్యారంటీలో భాగంగా మహాలక్ష్మి పథకం( Mahalaxmi Scheme ) కింద ఈ బస్సు ప్రయాణాన్ని మహిళలకు ఉచితంగా ఈ రోజు నుండి అందించడం జరుగుతుందన్నారు.
సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీని అమలు చేయడం జరిగిందని పేర్కొన్నారు.ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఈ రోజు నుండి పది లక్షలకు పెంచడం జరిగిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా నాయకులు లింగం గౌడ్,, పసుల కృష్ణ,మండల నాయకులు సూడిది రాజేందర్, రాజు నాయక్ పాల్గొన్నారు.