సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor) రష్మిక (Rashmika) హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం యానిమల్ (Animal).ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో కలెక్షన్లు కూడా భారీగానే రాబడుతుంది.ఇక ఈ సినిమాలో రష్మిక కాకుండా నటి తృప్తి డిమ్రి( Tripti Dimri ) కూడా నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ఈమె కాస్త బోల్డ్ సీన్స్ నటించి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు.

ఈమె ఇదివరకు పలు సినిమాలలో నటించిన రాని గుర్తింపు యానిమల్ సినిమాలో నటించిన ఈ బోల్డ్ సన్నివేశాల ద్వారా వచ్చిందని దీని ద్వారా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయిందని తెలుస్తుంది.ఇక ఈ సినిమా తరువాత ఎక్కడ చూసిన ఈమె పేరే మారు మోగిపోతుంది.అయితే తాజాగా ఈమెకు విరాట్ కోహ్లీ ( Virat Kholi) కి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అసలు విరాట్ కోహ్లీకి సిస్టర్ కావడం ఏంటి అనే విషయానికి వస్తే.

తృప్తి ఇదివరకు హిందీలో బుల్ బుల్ అనే సినిమాలో నటించారు.ఈ సినిమా నిర్మాతగా ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ సోదరుడు కర్నేష్ శర్మ వ్యవహరించారు .ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కర్నేష్ శర్మ( Karnesh Sharma ) తృప్తి ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారని వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తుంది.ఇక అనుష్కకి కర్నేష్ శర్మ సోదరుడు కావడంతో విరాట్ కోహ్లీకి వరుసకు బావ అవుతాడు.
దీంతో తృప్తి విరాట్ కోహ్లీకి వరుసకు చెల్లెలు అవుతుంది అంటూ ఈ వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
.






