గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా రేవేంద్రపాడుకు వెళ్లిన ఆయన తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించి రైతులను పరామర్శించారు.
ఏపీ ప్రజల కష్టాలు ఇక మూడు నెలలేనని చంద్రబాబు తెలిపారు.తాను పర్యటనకు వస్తున్నానని హడావుడిగా సీఎం జగన్ బయలుదేరారని పేర్కొన్నారు.
తుఫాను ప్రభావంతో రైతులు నష్టపోయారన్నారు.రైతుల కష్టాల తెలుసుకోవాల్సిన మంత్రులు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు.
పంట నష్ట పరిహారం తాను పెంచుకుంటూ వెళ్తే జగన్ తగ్గించుకుంటూ వచ్చారని విమర్శించారు.కనీసం పంట బీమా ప్రీమియం కూడా చెల్లంచలేదని మండిపడ్డారు.







