Sreeleela: దగ్గుబాటి అభిరామ్ పెళ్లి చేసుకునే అమ్మాయికి శ్రీలీలకి మధ్య ఉన్న సంబంధం ఏంటి..?

దగ్గుబాటి అభిరామ్ (Daggubati Abhiram) తాజాగా పెళ్లికి రెడీ అయినట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి.అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం ఇప్పటికే ఎయిర్ పోర్ట్ లో ఒకరి తర్వాత ఒకరు కనిపించినట్లు కూడా ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 What Is The Relationship Between Daggubati Abhirams Future Wife And Sreeleela-TeluguStop.com

ఇక పెళ్లి కోసమే వీరందరూ శ్రీలంక (Srilanka) కు వెళ్తున్నారని సమాచారం.ఇక శ్రీలంకలో దగ్గుబాటి అభిరామ్ ప్రత్యూష పెళ్లి మూడు రోజులు జరగబోతుందని సమాచారం.ఇక అభిరామ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ప్రత్యూష( Prathyusha ) రామానాయుడు తమ్ముడి మనవరాలని, వరుసకు మేనమరదలు అవుతుందని, చిన్నప్పటినుండి వీరిద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండడంతో ఇద్దరికీ పెళ్లి చేయాలని దగ్గుబాటి ఫ్యామిలీ నిర్ణయం తీసుకుందట.ఇక వీరి పెళ్లికి దాదాపు 200 మంది పాల్గొనబోతున్నారని ఇప్పటికే ఎన్నో వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Telugu Daggubati, Prathyusha, Sreeleela, Srilanka-Latest News - Telugu

అయితే సినీ ఇండస్ట్రీ నుండి చాలా తక్కువ మంది వీరి పెళ్లికి హాజరవుతుండగా వీరందరిలో శ్రీలీల( Sreeleela ) మాత్రం స్పెషల్ అంటూ ఒక వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.అయితే ఇండస్ట్రీలో ఉండే ఎవరు దగ్గుబాటి అభిరామ్ పెళ్లికి వెళ్లకున్నా కూడా శ్రీలీల వెళ్లడానికి ప్రధాన కారణం ఏంటి అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు.అయితే దగ్గుబాటి అభిరామ్ పెళ్లి చేసుకోబోయే ప్రత్యూష (Prathyusha) కి శ్రీలీలకి మధ్య చిన్నప్పటినుండి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉందట.

Telugu Daggubati, Prathyusha, Sreeleela, Srilanka-Latest News - Telugu

వీరిద్దరూ ఒకే దగ్గర చదువుకోవడంతో వీరిద్దరి మధ్య స్నేహబంధం ఉందట.అలా తన ప్రాణ స్నేహితురాలు కోసం శ్రీ లీలా (Sreeleela ) తన సినిమాలను సైతం పక్కన పెట్టి శ్రీలంకకు పెళ్లికి వెళ్లబోతుందని తెలుస్తోంది.ఇక ఈ విషయం చాలామందికి తెలియక శ్రీలీలకి దగ్గుబాటి ఫ్యామిలీతో ఉన్న అనుబంధం ఏంటి అని అందరూ మాట్లాడుకుంటున్నారు.

కానీ శ్రీలీలకి అభిరామ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ప్రత్యూష కి మధ్య ఫ్రెండ్షిప్ ఉందనే సంగతి చాలా మందికి తెలియదట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube