తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు అయిందని తెలుస్తోంది.అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేరు వినిపిస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర కసరత్తు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు కీలక సమావేశం నిర్వహించారు.
ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎం ఎంపికతో పాటు సీఎల్పీ నేత ఎంపికపై నాయకులు చర్చించారు.ఈ నేపథ్యంలోనే సీఎంగా రేవంత్ రెడ్డినే ఫైనల్ చేశారని తెలుస్తోంది.
ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం హైదరాబాద్ వేదికగా మరి కాసేపటిలో అధికార ప్రకటన చేయనుందని సమాచారం.







