తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది.ఇప్పటివరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోబోతోంది.
అయితే బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా ఎవరు ఎంపిక కాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆ బాధ్యతలను కేసీఆర్ అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్నా, మరికొన్ని పేర్లు తెరపైకి వస్తున్నాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్( KTR ) పనితీరుపై ఎవరికి సందేహాలు లేవు.భవిష్యత్తు లోనూ కేటీఆర్ కీలకం కాబోతూ ఉండడం తో ఆయనకే అవకాశం ఇవ్వాలని మెజారిటీ బిఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు .అయితే కేసీఆర్ ఈ విషయంలో ఏం చేస్తారనేది క్లారిటీ లేదు.

ఎట్టి పరిస్థితుల్లోనూ కెసిఆర్ శాసనసభాపక్ష నేతగా ఉండేందుకు ఇష్టపడరు.ఇప్పటి వరకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసిఆర్ అసలు అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనే విషయంలోనూ అనేక అనుమానాలు ఉన్నాయి.అయితే కేసీఆర్( kcr ) మాత్రం కేటీఆర్ వైపు మొగ్గు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర కీలక నాయకులతో ఇదే విషయంపై చర్చించగా, వారంతా కేటీఆర్ కే ఆ బాధ్యతలు అప్పగించాలని కోరారట.బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు( Harish rao )కు టిఆర్ఎస్ ఎల్ఫీ నేతగా బాధ్యతలు చేపట్టేందుకు అన్ని అర్హతలు ఉన్నా, భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని హరీష్ కు బాధ్యతలు అప్పగించేందుకు కేసీఆర్ అంత ఆసక్తి చూపించడం లేదట.

ఇక కేటీఆర్ , హరీష్ కాకపోతే సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డికి( Pocharam Srinivas Reddy ) ఆ పదవి కేసిఆర్ అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుంది.కాంగ్రెస్ ను ఎదుర్కోవడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత అషామాషి కాదని, అన్ని విషయాల్లోనూ బీఆర్ఎస్ పై వచ్చే విమర్శలను తిప్పికొట్టగలిగి , అధికార పార్టీ పై చేయి సాధించగలిగిన మంచి వాక్ చాతుర్యం ఉన్నవారికి ఈ పదవిని అప్పగించాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారట.అందుకే కేటీఆర్ వైపే ఎక్కువ మొగ్గు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయినా ఈ రేసులో హరీష్ రావు తో పాటు , సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరు తెరపైకి వస్తోంది.







