రణబీర్ కపూర్, రష్మిక మందన( Ranbir Kapoor Rashmika Mandana ) కలిసి నటించిన తాజా చిత్రం యానిమల్.( Animal movie ) ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లో విడుదలై సినిమా కోట్లల్లో కలెక్షన్స్ ను రాబడుతూ దూసుకుపోతోంది.అంతేకాకుండా విడుదల అయిన మొదటి రోజే 116 కోట్లను రాబట్టి రణ్‌బీర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా మార్క్ క్రియేట్ చేసింది.
ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తూ దూసుకుపోతోంది.ఆ సంగతి పక్కన పెడితే తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లియో సినిమా కూడా ఇటీవలే విడుదల ఈ సూపర్ హిట్టుగా నిలిచిన విషయం తెలిసిందే.
మిగతా భాషల సంగతి పక్కన పెడితే తమిళంలో సూపర్ హిట్ గా నిలిచింది.అంతేకాకుండా భారీగా కలెక్షన్స్ ను సాధించింది.అలా లియో,యానిమల్ సినిమాలలో క్రూరత్వం ఉన్న విషయం తెలిసిందే.సినిమాలో ఎంత క్రూరత్వం ఉంటే సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది అని ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్.
ఒక యానిమల్ సినిమా లియో సినిమాలు మాత్రమే కాదు ఇక మీదట థియేటర్లలోకి విడుదల అయ్యే సినిమాలు అన్నీ కూడా అవే పంథాలోనే కనిపిస్తున్నాయి.యానిమల్ సినిమాలో రక్తపాతం చూస్తే కళ్లు తిరుగుతాయి.
అన్ని వందల మందిని అలా చంపడాలు చూపించడం ఎందుకు? అంత జుగుప్స అవసరమా? అంటూ రకరకాల డిస్కషన్లు జరుగుతున్నాయి.
లియో విషయంలో కూడా ఇలాంటి టాపిక్ ట్రెండ్ అయింది.ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలతో పాటు త్వరలో విడుదల కాబోతున్న సినిమాల విషయంలో కూడా ఇదే చర్చించుకుంటున్నారు నెటిజన్స్.తెలియని మృగాలను భయపెట్టే వాడి కథగా దేవర రెడీ అవుతోంది.
అండర్ వాటర్ సీక్వెన్స్ మాత్రమే కాదు, సినిమాలో ప్రతి యాక్షన్ ఎపిసోడ్ స్పెషల్‌గా ఉంటుందనే వార్తలు అందుతున్నాయి.అదేవిధంగా తమిళ హీరో సూర్య( Suriya ) హీరోగా నటిస్తున్న కంగువ సినిమాలోనూ( Kanguva movie) ఇలాంటి సన్నివేశాలు కోకొల్లలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.
కంగువగా సూర్య లుక్ చూస్తేనే శత్రువులు భయంతో పరుగులు తీసేలా అనిపిస్తోంది.ఇక బరిలోకి దిగి యాక్షన్ అంటూ చేయడం మొదలుపెడితే పరిస్థితి ఎలా ఉంటుందో రిలీజ్ డే రోజు విట్‌నెస్ చేయాల్సిందే.