సినిమాలో కనిపించే ఫుడ్ సర్వ్ చేస్తున్న యూఎస్ కంపెనీ..

సాధారణంగా సినిమాల్లో కనిపించే ఫుడ్ చేసినప్పుడు మనకు వాటిని తినాలనిపిస్తుంది.కానీ ఆ ఫుడ్ ఏంటి, అదెక్కడ దొరుకుతుందనే వివరాలు మనకి అసలు తెలియదు.

 The Us Company Serving The Food Seen In The Movie.. Fork N Film, Dining, Movie--TeluguStop.com

అందువల్ల అవి చూసి ఆస్వాదించడం తప్ప తినే అవకాశం లభించదు.ఇది కొందరిని డిసప్పాయింట్ చేస్తుంది.

అయితే ఆ నిరాశ ఆడియన్స్ లో కలగకుండా ఉండేందుకు ఫోర్క్ ఎన్ ఫిల్మ్( Fork n Film ) అనే యుఎస్ కంపెనీ ఒక వినూత్న ఆలోచన చేసింది.ఈ కంపెనీ సినిమాలోని ఫుడ్ ఐటమ్స్ ట్రై చేస్తూ, సినిమా చూసే అనుభవాన్ని అందిస్తుంది.

ఇది సినిమాల్లో చూపిన ఫుడ్ ఐటమ్స్ లాంటి వంటకాలను అందిస్తుంది, అవి తెరపై కనిపించే సమయంలోనే ఈ థియేటర్ సిబ్బంది ఫుడ్ తెచ్చి ఆడియన్స్ ముందు ఉంచుతారు.ఈ విధంగా, అతిథులు సినిమాలలో కనిపించిన ప్రతి ఐటమ్ యాక్టర్స్ తో సహా రుచి చూడవచ్చు.ఈ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ వారు ఆస్వాదించవచ్చని కంపెనీ పేర్కొంది.

ఇటీవల, ఒక ఇన్‌స్టాగ్రామ్( Instagram ) అకౌంట్ ఫోర్క్ ఎన్ ఫిల్మ్ థియేటర్‌లో వేసిన “హోమ్ అలోన్( Home Alone ) స్క్రీనింగ్ వీడియోను పోస్ట్ చేసింది.1990 సినిమాలో చూసిన ఆహార పదార్థాలను ప్రదర్శించిన తొమ్మిది-కోర్సుల భోజనానికి ప్రేక్షకులు ఎలా ఆదరించారో వీడియో చూపించింది.వీడియో క్యాప్షన్‌లో “ఎప్పుడైనా సినిమాలో చూసిన ఫుడ్ ట్రై చేయాలని అనిపిస్తే, ఈ ఎక్స్‌పీరియన్స్ మీకోసమే!” అని రాశారు.

ఈ వీడియో వైరల్‌గా మారి 7 లక్షలకు పైగా లైక్‌లను అందుకుంది.చాలా మంది వ్యక్తులు ఈ ఐడియా బాగానే ఉందని కానీ సినిమాలో లాంటి ఫుడ్ ఈ కంపెనీ ప్రిపేర్ చేయగలుగుతుందా అని సందేహాలు వ్యక్తం చేశారు.

ఈ కంపెనీ సరిగ్గా సినిమాలో కనిపించే వంటకాన్ని తయారు చేయలేదని, టేస్ట్ బాగుండదని ఇంకొందరు విమర్శించారు.ఏదేమైనా ఈ క్రియేటివ్ ఐడియా తమకు నచ్చిందని కొందరు అన్నారు.

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube