ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహాత్మక కమిటీ సమావేశం మరికాసేపటిలో జరగనుంది.ఈ భేటీలో ప్రధానంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించనున్నారు.
ఈ సమావేశంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.సీఎం అభ్యర్థిని పార్టీ అధిష్టానమే నిర్ణయించాలని ఉదయం జరిగిన సీఎల్పీ సమావేశంలో తెలంగాణ నాయకత్వం ఏకవాక్య తీర్మానం చేసి పంపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం అభ్యర్థిపై కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది.కాగా ఇవాళ్టి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయన్న సంగతి తెలిసిందే.







