యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి కోటపై నాలుగు దశబ్దాల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరింది.భువనగిరి నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదివారం జరిగిన కౌంటింగ్ లో తమ సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిపై 26 వేల మెజార్టీతో జయకేతనం వెగురవేశారు.
భువనగిరి ఎమ్మెల్యేగా ఉన్న పైళ్ల శేఖర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారని,
బీఆర్ఎస్ పార్టీపై ప్రజలల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో పైళ్ల శేఖర్ రెడ్డి చూపిన అభివృద్ధి మంత్రం కూడా ప్రజలు పట్టించుకోలేదని, అదేవిధంగా భువనగిరిలో పైళ్ల శేఖర్ రెడ్డి చేసిన భూ కబ్జాలతో పైళ్ల వ్యక్తిగత ఇమేజ్ కు దెబ్బ తీసిందని, అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా ఉండడంతో పాటు స్థానికత,కుంభం అనిల్ కుమార్ రెడ్డి పట్ల ప్రజల్లో సానుభూతి కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చిందనే చెబుతున్నారు.







