తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది.ఈ మేరకు డీజీపీ అంజనీకుమార్ ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది.
ఎన్నికల ప్రవర్తనా నియామాలు ఉల్లంఘించినందుకు ఈసీ చర్యలు తీసుకుంది.అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెల్లడి కాకముందే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని డీజీపీ అంజనీకుమార్ కలిసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో రేవంత్ ను కలిసిన ఆయన పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.ఈ ఘటనపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
డీజీపీది అత్యుత్యాహంగా పరిగణించిన ఈసీ నియమాలను ఉల్లంఘించినందుకు గానూ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.







