వింట‌ర్ లో డ్రై స్కాల్ప్ ను నివారించే బెస్ట్ టిప్స్ మీకోసం!

ప్రస్తుతం వింటర్ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చలికాలంలో మనం ఎదుర్కొనే కొన్ని సాధారణ సమస్యల్లో డ్రై స్కాల్ప్ ఒకటి.

 Simple Tips To Get Rid Of Dry Scalp! Dry Scalp, Simple Tips, Latest News, Hair C-TeluguStop.com

చలికాలంలో తేమ తగ్గిపోవడం వల్ల మన స్కిన్ తో పాటు స్కాల్ప్ కూడా పొడి బారుతుంది.స్కాల్ప్ పొడిబారిపోవడం వల్ల తీవ్రమైన దురదతో పాటు ఎంతో అసౌకర్యానికి గురవుతుంటారు.

అలాగే డ్రై స్కాల్ప్ వల్ల హెయిర్ ఫాల్ సైతం పెరిగిపోతుంది.ఈ క్రమంలోనే డ్రై స్కాల్ప్‌ సమస్య నుంచి బయటపడడం కోసం ప్రయత్నిస్తుంటారు.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే టిప్స్ చాలా అద్భుతంగా సహాయపడతాయి.ఈ టిప్స్ ను పాటిస్తే సులభంగా సమస్యను పరిష్కరించుకోవచ్చు.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్(Aloe vera gel ), రెండు టేబుల్ స్పూన్లు ఆముదం(castor oil) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.మూడు రోజులకు ఒకసారి ఈ విధంగా చేస్తే పొడిబారిన స్కాల్ప్ తేమగా మారుతుంది.

Telugu Aloe Vera Gel, Applecider, Oil, Dry Scalp, Care, Care Tips, Healthy Scalp

అలాగే యాపిల్ సైడర్ వెనిగర్(Apple Cider Vinegar) కూడా నెత్తిపై తేమను పెంచుతుంది.ఒక గ్లాస్ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసి స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ కు రెండు మూడు సార్లు బాగా స్ప్రే చేసుకోవాలి.అరగంట అనంతరం హెయిర్ వాష్ చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.

Telugu Aloe Vera Gel, Applecider, Oil, Dry Scalp, Care, Care Tips, Healthy Scalp

ఇక మిక్సీ జార్ తీసుకొని ఒక అరటిపండు, ఒక అవకాడో, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి స్మూత్ ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం తల స్నానం చేయాలి.

ఇలా చేస్తే డ్రై స్కాల్ప్ సమస్య దూరం అవుతుంది.చుండ్రు ఉన్నా కూడా మాయం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube