ప్రముఖ స్మార్ట్ టీవీ తయారీ సంస్థలు తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్లతో టీవీలను మార్కెట్లలో విడుదల చేస్తున్నాయి.అయితే ప్రస్తుతం భారత మార్కెట్లో 40 అంగుళాల స్మార్ట్ టీవీలకు మంచి ఆదరణ లభిస్తోంది.
ప్రజలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్న 40 అంగుళాల స్మార్ట్ టీవీలలో బెస్ట్ స్మార్ట్ టీవీలు ఏవో చూద్దాం.
వన్ ప్లస్ Y1S HD LED స్మార్ట్ టీవీ: ఈ టీవీ 40 అంగుళాల డిస్ ప్లే తో ఉంటుంది.1920*1080 పిక్సెల్ లు, 60Hz రిఫ్రెష్ రేట్, కారెక్ట్స్ A53 ప్రాసెసర్, 1GB RAM,8GB స్టోరేజ్ తో ఉంటుంది.డాల్బీ ఆడియో, 20 స్పీకర్లు, క్రోమ్ కాస్ట్ సపోర్ట్, ఆండ్రాయిడ్ టీవీ 11 ఆపరేటింగ్ సిస్టం, HDR 10ప్లస్ సపోర్ట్ తో ఉంటుంది.
ఈ స్మార్ట్ టీవీ ధర విషయానికి వస్తే.ఫ్లిప్ కార్ట్ లో రూ.23999 కు అందుబాటులో ఉంది.సెలెక్ట్ చేసిన బ్యాంక్ కార్డుల నుంచి EMI మోడ్ ద్వారా కొనుగోలు చేస్తే, రూ.1500 డిస్కౌంట్ పొందవచ్చు.

Xiaomi Mi 5A స్మార్ట్ టీవీ: ఈ టీవీ 40 అంగుళాల డిస్ ప్లే తో ఉంటుంది. 1920*1080 పిక్సెల్ లు, 60Hz రిఫ్రెష్ రేట్, 1.5GB RAM,8GB స్టోరేజ్ తో ఉంటుంది.డాల్బీ ఆడియో, 24 స్పీకర్లు, క్రోమ్ కాస్ట్ ఫీచర్, ఆండ్రాయిడ్ టీవీ 11 ఆపరేటింగ్ సిస్టం, వివిడ్ పిక్చర్ ఇంజిన్, క్వాడ్-కోర్ కారెక్ట్స్ A55, గూగుల్ అసిస్టెంట్ ఫీచర్లతో( Google Assistant features ) ఉంటుంది.ఈ స్మార్ట్ టీవీ ధర విషయానికి వస్తే ఫ్లిప్ కార్ట్ లో రూ.21990 కు అందుబాటులో ఉంది.సెలెక్ట్ చేసిన బ్యాంక్ కార్డుల నుంచి EMI మోడ్ ద్వారా కొనుగోలు చేస్తే, రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు.

Acer I సిరీస్ HD LED స్మార్ట్ టీవీ: ఈ టీవీ 40 అంగుళాల డిస్ ప్లే తో ఉంటుంది.1.5GB RAM,16GB స్టోరేజ్, డాల్బీ ఆడియో, 30వాట్స్ స్పీకర్లు, 64- బిట్ క్వాడ్- కోర్ ప్రాసెసర్, HDR 10 సపోర్ట్, డ్యూయల్- బ్యాండ్ wifi, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ కాస్ట్ సపోర్ట్ ఫీచర్లతో ఉంటుంది.ఈ స్మార్ట్ టీవీ ధర విషయానికి వస్తే అమెజాన్ లో రూ.17999 కే పొందవచ్చు.
థామ్సన్ FA సిరీస్ స్మార్ట్ టీవీ: ఈ టీవీ 40 అంగుళాల డిస్ ప్లే తో ఉంటుంది.గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ కాస్ట్ సపోర్ట్, HDMI పోర్ట్, USB పోర్ట్, డాల్బీ డిజిటల్ ప్లస్ ఆడియో, 30వాట్స్ స్పీకర్లు, ఆండ్రాయిడ్ టీవీ 11 ఆపరేటింగ్ సిస్టం లాంటి ప్రత్యేక ఫీచర్లతో ఉంటుంది.ఫ్లిప్ కార్ట్ లో రూ.15999 కే పొందవచ్చు.







