ఈ మధ్య కాలంలో చాలామంది తల్లీదండ్రులు తమ పిల్లలకు క్రీడలపై ఆసక్తి ఉన్నా క్రీడల విషయంలో ప్రోత్సహించడం లేదు.అయితే హైదరాబాద్ కు చెందిన 28 సంవత్సరాల వయస్సు ఉన్న స్పూర్తి ఒకవైపు చదువులో రాణిస్తూనే మరోవైపు క్రీడల్లో పతకాలు సాధిస్తుండటం గమనార్హం.
ప్రస్తుతం స్పూర్తి( spoorthy ) లా చదువుతుండగా జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలలో పాల్గొని పతకాలు సాధిస్తున్నారు.
స్పూర్తి తాజాగా కిర్గిజ్ స్థాన్ ( Kyrgyzstan )లో అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొని స్పూర్తి పతకాలు సాధించారు.
స్పూర్తి తన సక్సెస్ గురించి మాట్లాడుతూ సహజంగా ఇళ్లలో బరువులు ఎత్తే పనులు అమ్మాయిలకు చెప్పరని అన్నారు.ఆ పనులు కేవలం అబ్బాయిల పనులు అనే విధంగా చూస్తారని ఆమె కామెంట్లు చేశారు.
బాల్యం నుంచి మెలుకువలు తెలుసుకుంటే అమ్మాయిలు సైతం సులువుగా బరువులు ఎత్తుతారని స్పూర్తి తెలిపారు.

వెయిట్ మేనేజ్ మెంట్ అమ్మాయిలకు చాలా ముఖ్యమని ఆమె అన్నారు.అమ్మాయిలకు ఈ రంగంలో ప్రధాన సమస్య నెలసరి అని స్పూర్తి చెప్పుకొచ్చారు.అది ఫేస్ చేయాల్సి వస్తుందని ఆమె పేర్కొన్నారు.
ప్రతిసారి ఒకే బరువును మోయలేమని శక్తిలోనూ మార్పులు వస్తుంటాయని స్పూర్తి కామెంట్లు చేశారు.రెండో తరగతి నుంచి స్పోర్ట్స్ లో ప్రవేశం ఉందని స్పూర్తి అన్నారు.

సివిల్ సర్వీసెస్ ( Civil Services )కోసం ప్రిపేర్ అవుతూ స్పోర్ట్స్ లో సాధన చేస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు.ప్రతిచోట ఎన్నో సవాళ్లు ఉంటాయని ఆ సవాళ్లను అధిగమిస్తే మాత్రమే సక్సెస్ దక్కుతుందని ఆమె తెలిపారు.స్పూర్తి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.రాబోయే రోజుల్లో స్పూర్తి మరిన్ని విజయాలను సొంతం చేసుకుని ఆదర్శంగా నిలవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
స్పూర్తి సక్సెస్ ఎంతోమందిని ఆకట్టుకుంటోందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.







