మనిషి పగ, ప్రతీకారాలను పెంచుకుంటే చివరికి అవి దారుణ హత్యలకే దారితీస్తాయి అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.ఓ వ్యక్తి పాత కక్ష్యలను మనసులో పెట్టుకొని శత్రువుని గొడ్డలితో నరికి హత్య చేసి, ఆ తర్వాత హతుడి కొడుకు చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన కొమురం భీం జిల్లాఆసిఫాబాద్ ( Kumuram Bheem Asifabad ) లో చోటుచేసుకుంది.
ఆసలు ఏం జరిగిందో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఆసిఫాబాద్ పట్టణంలోని బెస్తవాడలో నివాసం ఉంటున్న గుబిడ శ్రావణ్ (42) అనే వ్యక్తి, బమ్నే శ్రీను అనే వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.ఆ తర్వాత తన తండ్రి హత్యకు గురైన విషయం తెలిసినా గుబిడ శ్రావణ్ కుమారుడు ఆవేశంతో బమ్నే శ్రీను ను వెంబడించి హత్య చేశాడు.
పట్టణంలో జంట హత్యలు చోటు చేసుకోవడంతో స్థానికంగా ఉండే ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు.
పోలీసులకు( Police ) సమాచారం అందడంతో పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.పోలీసులు సంఘటన స్థలాలను పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం( Postmortem ) నిమిత్తం ఆసుపత్రికి తలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుబిడ శ్రావణ్, బమ్నే శ్రీనుకు మధ్య పాత కక్ష్యలు ఉన్నాయని, అందుకే శ్రీను అకారణంగా గొడ్డలితో నరికి శ్రావణ్ ను హత్య చేశాడు.ఈ విషయం శ్రావణ్ కుమారుడికి తెలియడంతో క్షణికావేశంలో శ్రీనును వెంబడించి హత్య చేశాడని పోలీసులు తెలిపారు.ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు లోను కాకుండా ఉండాలని, అందుకోసం పట్టణంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని తెలుపుతూ.
ఈ హత్యలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.