యానిమల్ ట్రైలర్ విడుదల చేయడానికి ముందు 50 సార్లు చూశాను: సందీప్ రెడ్డి

అర్జున్ రెడ్డి ( Arjun Reddy ) సినిమా ద్వారా ఒక్కసారిగా సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి( Sandeep Reddy ) .ఇలా అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ఇదే సినిమాని హిందీలోకి రీమేక్ చేశారు కబీర్ సింగ్ సినిమా ద్వారా హిందీలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినటువంటి ఈయన అక్కడ కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

 Sandeep Reddy Interesting Comments On Animal Trailer Video, Animal, Rashmik-TeluguStop.com

ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్థిరపడినటువంటి సందీప్ రెడ్డి నేడు యానిమల్ ( Animal ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Telugu Animal, Arjun Reddy, Bollywood, Ranbir Kapoor, Rashmika, Sandeep Reddy, T

రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) రష్మిక మందన్న ( Rashmika Mandanna ) హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఈ సినిమా నేడు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇదివరకు సందీప్ రెడ్డి తో పాటు హీరో హీరోయిన్లు కూడా ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేశారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సందీప్ రెడ్డి ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.

ప్రస్తుత కాలంలో ట్రైలర్ లో కానీ సినిమాలో కానీ కాస్త తప్పులు కనపడితే కనుక భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Telugu Animal, Arjun Reddy, Bollywood, Ranbir Kapoor, Rashmika, Sandeep Reddy, T

అర్జున్ రెడ్డి సినిమా సమయంలో కూడా సందీప్ రెడ్డి ఇలాంటి ట్రోల్స్ ఎన్నో ఎదుర్కొన్నారు.అయితే అలాంటివి మరోసారి రిపీట్ కాకూడదన్న ఉద్దేశంతో యానిమల్ సినిమా ట్రైలర్ విడుదల చేయడానికి ముందు ఈయన ప్రతి సన్నివేశాన్ని చాలా క్లుప్తంగా పరిశీలించి విడుదల చేశారని తెలిపారు.ఈ ట్రైలర్ విడుదలకు 50 సార్లు వరకు ట్రైలర్ చూసి ఉంటాను అంటూ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సందీప్ రెడ్డి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube