పటిష్ట బందోబస్తు మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కి తరలింపు..

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ ప్రక్రియ ముగిసిందని,జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులకు, సిబ్బందికి క్షేత్రస్థాయిలో 24/7 అందుబాటులో ఉండి మరియు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సిబ్బందికి,రూట్ మొబైల్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ సూచనలు ఇస్తూ జిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగుసేలా పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగింది.పటిష్ట బందోబస్తు మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కి తరలింపు.

 Moving Evms To Strong Room Amid Strong Security, Evms ,strong Room , Telangana E-TeluguStop.com

సీసీటీవీ లు, కేంద్ర,రాష్ట్ర పోలీసు బలగాలతో మూడు అంచెల భద్రత మధ్య నిరంతరం గస్తీలో ఈవీఎం స్ట్రాంగ్ రుమ్స్.

జిల్లా పరిధిలోని సిరిసిల్ల, వేములవాడ నియెజకవర్గ లలో ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం అట్టి ఈవీఎంలు జిల్లా ,కేంద్ర బలగాలతో బద్దెనపల్లి లోని స్ట్రాంగ్ రూమ్ తరలించడం జరుగుతుందని, తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో వేరు వేరుగా ఏర్పాటు చేసిన సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తర్వాత భద్రపరిచే ఈవిఎం స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి జిల్లా ,కేంద్ర బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న వృద్దులకు సహాయంగా నిలిచిన పోలీస్ యంత్రాంగాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube