కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు( Telangana Assembly Elections ) ముగిసాయి.ఈ తరుణంలో ఎగ్జిట్ పోల్స్( Exit Polls ) విడుదలయ్యాయి.
ప్రీ పోల్ సర్వేలకు తగినట్లుగానే ఎగ్జిట్ పోల్ లో కాంగ్రెస్ పార్టీ( Congress Party ) అధికారంలోకి వస్తుందనే ఫలితాలు వచ్చాయి.ఈ క్రమంలో ప్రీ పోల్ సర్వేల ఫలితాలపై కేటీఆర్( KTR ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
పోలింగ్ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
70 కి పైగా స్థానాలలో గెలుస్తామని చెప్పుకొచ్చారు.మళ్లీ అధికారం తమదేనని హ్యాట్రిక్ కొట్టబోతున్నట్లు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై కంగారు పడాల్సిన అవసరం లేదని అదంతా తప్పుల తడక అని అన్నారు.చాలామంది ఓటర్లు ఇంకా క్యూ లైన్ లలో ఓటు వేయడానికి వెయిట్ చేస్తున్నారు.
ఓటర్లు ఇంకా వేచి ఉండగా.ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడించటం ఏమిటని కేటీఆర్ నిలదీశారు.2018లో వచ్చినా చాలా ఏజెన్సీల ఎగ్జిట్ పోల్స్ తల్లకిందులు అయ్యాయి.ఖచ్చితంగా మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని… కేటీఆర్ స్పష్టం చేయడం జరిగింది.