రణ్ బీర్ కపూర్, రష్మిక కాంబోలో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన యానిమల్ మూవీ( Animal Movie ) మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది.ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.
అయితే రణ్ బీర్ కపూర్( Ranbir Kapoor ) ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉంది.రణ్ బీర్ ఫ్యామిలీ సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాగా రణ్ బీర్ తల్లి సైతం నటిగా కెరీర్ ను కొనసాగించారు.
రణ్ బీర్ కపూర్ పదో తరగతి పూర్తి చేసిన వెంటనే ఆ ఆబ్ లౌట్ చలే ప్రాజెక్ట్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.ఆ తర్వాత న్యూయార్క్ కు వెళ్లి అక్కడ యాక్టింగ్ లో శిక్షణ పొందారు.
ట్రైనింగ్ లో ఉన్న సమయంలో స్వీయ దర్శకత్వంలో రెండు షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన రణ్ బీర్ కపూర్ బ్లాక్ అనే ప్రాజెక్ట్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా( Assistant Director ) పని చేశారు.అయితే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సమయంలో ఎదురైన కష్టాలను రణ్ బీర్ చెప్పుకొచ్చారు.
అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో ఫ్లోర్ తుడవడం( Floor Cleaning ) నుంచి సెట్స్ లో బల్బులు వెలిగించడం వరకు అన్ని పనులు చేశానని రణ్ బీర్ అన్నారు.ప్రతిరోజూ కొత్తగా ఎన్నో విషయాలు నేర్చుకునేవాడినని రణ్ బీర్ కామెంట్లు చేశారు.సంజయ్ లీలా భన్సాలీ( Sanjay Leela Bhansali ) రణ్ బీర్ ను బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు.రణ్ బీర్ తొలి సినిమా సావరియా( Saawariya ) కాగా రణ్ బీర్ ఎన్నో అవార్డులను అందుకున్నారు.
బ్రహ్మాస్త్ర పార్ట్1 సినిమాతో రణ్ బీర్ కపూర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు.మన దేశంలోని అత్యుత్తమ నటులలో రణ్ బీర్ ఒకరని జక్కన్న పేర్కొన్నారు.రణ్ బీర్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.రణ్ బీర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.