Actress Bhanupriya: ఆ హీరోయిన్స్ ఎవరు నన్ను పార్టీలకు పిలవరు… భానుప్రియని పూర్తిగా పక్కన పెట్టేశారా?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాష చిత్రాలలో అగ్ర తారలుగా వెలిగినటువంటి వారిలో రమ్యకృష్ణ, రాధిక, కుష్బూ, సుహాసిని, రాధా, భానుప్రియ వంటి సెలబ్రిటీలందరూ కూడా ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఇలా వీరంతా కూడా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్స్ గా ఇండస్ట్రీలో ఓవెలుగు వెలిగారు అయితే ఇలా ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈ హీరోయిన్స్ అందరూ కూడా ఇప్పటికీ పెద్ద ఎత్తున ప్రతి ఏడాది ఘనంగా పార్టీలు చేసుకుంటూ ఉంటారు.

 Latest News About Senior Actress Bhanupriya-TeluguStop.com

ఇలా ఒకరి బర్త్ డే సందర్భంగా మరొకరు కలవడం పార్టీలలో పాల్గొనడం బాగా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు.అయితే వీరిలో మాత్రం ఎప్పుడూ కూడా మనకు భానుప్రియ (Bhanu Priya) కనిపించరు భానుప్రియను ఈ బ్యాచ్ మొత్తం పూర్తిగా పక్కన పెట్టేసారని తెలుస్తోంది తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి భానుప్రియకు ఇదే ప్రశ్న ఎదురయింది.

మీతో పాటు వచ్చినటువంటి మీతోటి నటీమణులందరూ కూడా ఇప్పటికీ అదే స్నేహబంధం కొనసాగిస్తూ ప్రతి ఏడాది ఎంతో ఘనంగా పార్టీలు( Parties ) చేసుకుంటూ ఉన్నారు.కానీ మీరు ఎందుకు ఆ పార్టీలలో కనిపించరు అంటూ ప్రశ్న ఎదురయింది.

Telugu Bhanu Priya, Senioractress, Tollywood-Movie

ఈ ప్రశ్నకు భానుప్రియ సమాధానం చెబుతూ ఇప్పటికి వాళ్లతో నాకు పెద్దగా కాంటాక్ట్స్ లేవు కానీ ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడుతానని కానీ వాళ్లంతా పార్టీలు చేసుకుంటున్నప్పుడు నన్ను ఎవరు కూడా రమ్మని తనకు ఇన్వైట్ చేయలేదని అందుకే తాను కూడా అక్కడికి వెళ్లనని తెలిపారు.ఎవరు నిజంగానే పిలవలేదా అని అడగగా తనని ఎవరు పిలవరని అందుకే నేను కూడా వెళ్ళనని ఈమె తెలియజేశారు.ఒకానొక సమయంలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందినటువంటి ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్నారు.

Telugu Bhanu Priya, Senioractress, Tollywood-Movie

ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి భానుప్రియ నిజజీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.ఈమె పెళ్లయిన తర్వాత తన భర్త వదిలేయడం కూతురిని తీసుకుని చెన్నైలో( Chennai ) స్థిరపడి సినిమాలలో తిరిగి నటించారు.అయితే సినిమాలలో హీరోయిన్గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.

ఇక ప్రస్తుతం అవకాశాలు కూడా లేకపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నారు.

Telugu Bhanu Priya, Senioractress, Tollywood-Movie

ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి భానుప్రియ డాన్స్ క్లాస్( Dance Class ) నిర్వహిస్తూ ఉండేవారు.ఇక ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోవడంతో తాను పూర్తిగా హోం మేకర్ గా మారిపోయానని ఇంటి పనులు చూసుకుంటూ కాలక్షేపం గడిపేస్తున్నానంటూ తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారడంతో భానుప్రియ పరిస్థితి చూసి అందరూ షాక్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube