మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా తమ పిల్లల పట్ల ఎంతో ప్రేమను కురిపిస్తాయి వాటికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటాయి.ఒక పిల్లి తల్లి( cat mother ) ఇదే మాటలను నిజం చేస్తోంది.ఈ మదర్ క్యాట్ వీడియో ఎక్స్‌లో వైరల్ అవుతుంది.@Yoda4ever ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చేసిన వీడియోలో ఒక తల్లి పిల్లి చెడు కలలు కంటున్న తన పిల్లను ఓదార్చడం కనిపించింది.
వీడియోకు “మమ్మీ క్యాట్ హగ్స్ బేబీ కిట్టెన్ హావింగ్ ఎ నైట్‌మేర్.” అనే క్యాప్షన్ జోడించారు.తల్లి పిల్లి, దాని పిల్ల మంచం మీద నిద్రిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు.పిల్లి నిద్రలో మెలికలు తిరుగుతూ కాస్త ఆందోళనగా కనిపిస్తుంది, ఇది ఒక పీడకలని సూచిస్తుంది.
తన పిల్ల అల్లాడిపోవడం చూసి తల్లి పిల్లి చలించిపోతుంది.తల్లి పిల్లి తన ముందరకాలను పిల్ల చుట్టూ చుట్టి, తన ఛాతకి దగ్గరగా దానిని కౌగిలించుకుంటుంది.
తన నోటితో నాకుతూ పిల్లి పిల్లను కంఫర్ట్ చేస్తుంది.
ఈ వీడియో ఎక్స్‌లో వైరల్‌గా మారింది, ఒక రోజులో దాదాపు 29 లక్షలు వ్యూస్ వచ్చాయి.తల్లి, పిల్లి మధ్య ఉన్న ప్రేమ బంధంపై చాలా మంది భావోద్వేగమైన కామెంట్స్ చేశారు.కొందరు తల్లి పిల్లి సహజమైన, రక్షణాత్మక ప్రతిస్పందన పట్ల తమ అభిమానాన్ని కూడా వ్యక్తం చేశారు.
ఈ వీడియోకు ఇప్పటికే 32 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.దీనిని మీరు చూడాలనుకుంటే https://twitter.com/Yoda4ever/status/1729477632046293502?s=19 లింక్‌పై క్లిక్ చేసి వీడియో చూడవచ్చు.