తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులలో నితిన్( Nithiin ) ఒకడు.ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే నితిన్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో చేసిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్( Extra Ordinary Man ) అనే సినిమా డిసెంబర్ 8వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది.ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని కూడా సినిమా యూనిట్ చాలా ఫాస్ట్ గా నిర్వహిస్తుంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న నితిన్ తన తదుపరి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.
ఇక ఇప్పటికే ఈయన వెంకీ కుడుముల( Venky Kudumula ) లాంటి స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ లో రెండవ సినిమా చేయబోతున్న క్రమంలో ఇప్పుడు వేణు శ్రీ రామ్( Venu Sriram ) డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు అనే అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది.ఇక దీనికి తగ్గట్టుగానే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా దిల్ రాజు వ్యవహరిస్తున్నాడు.అయితే ఈ సినిమాకి ఒకప్పటి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎవర్ గ్రీన్ టైటిల్ అయిన తమ్ముడు( Thammudu ) అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు అయితే ఈ సినిమా అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా అంటూ చాలా రకాల పుకార్లైతే వస్తున్నాయి.
దానికి నితిన్ సమాధానం చెబుతూ ఏ హీరోకి సంబంధించిన కథ కాదు ఇది… జస్ట్ అన్నాదమ్ముల రిలేషన్ షిప్ ని బలంగా చూపించే సినిమా మాత్రమే అంటూ నితిన్ సమాధానం చెప్పాడు.ఇక దీంతో నెక్స్ట్ వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ కోసం రాసుకున్న ఐకాన్ అనే సినిమాని ఆయనతో చేయడానికి అవకాశం అయితే ఉంది.ఇక ఈ సినిమా ఎప్పుడు చేస్తారు అనేది మాత్రం తెలియదు.కాబట్టి వేణు శ్రీరామ్ ప్రస్తుతం నితిన్ తో చేసే సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు గా తెలుస్తుంది…
.