టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర ముమ్మిడివరం నియోజకవర్గంలో కొనసాగుతోంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట ఇచ్చి మడమ తిప్పిన వ్యక్తి సీఎం జగన్ అని విమర్శించారు.
జీపీఎస్ తెచ్చి ఉద్యోగులను జగన్ మోసం చేశారని లోకేశ్ ఆరోపించారు.దేశ చరిత్రలోనే వంద సంక్షేమ పథకాలను కట్ చేసిన ఘనత జగన్ ది అని పేర్కొన్నారు.ఏపీలో నిశబ్ద యుద్ధం జరుగబోతోందన్నారు.2024లో టీడీపీ – జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని తెలిపారు.అధికారంలోకి రాగానే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు.దళితులకు కట్ చేసిన 27 పథకాలను మళ్లీ తీసుకొస్తామన్న లోకేశ్ బాంబులకే భయపడని తాము కేసులకు భయపడతామా అని ప్రశ్నించారు.







