ఐపీఎల్ 2024 ( IPL 2024 )వేలం డిసెంబర్ 19న దుబాయిలో జరగనున్న సంగతి తెలిసిందే.ఐపీఎల్ లో పాల్గొనే జట్లలో కీలక మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఐపీఎల్ లో పాల్గొనే జట్ల ఫ్రాంచైజీల దృష్టి అంతా వన్డే వరల్డ్ కప్ లో అద్భుత ఆటను ప్రదర్శించిన ఆటగాళ్లపైనే ఉంది.ప్రపంచ కప్ లో అదరగొట్టిన ఆటగాళ్లను దక్కించుకోవడం కోసం ఫ్రాంచైజీలు అధిక ధర వేచించనున్నాయి.అయితే అత్యధిక రికార్డ్ ధర పలికే అవకాశం ఉన్న ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
డారిల్ మిచెల్
: ఇటీవలే జరిగిన వన్డే వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్లలో ఒకడిగా మిచెల్ నిలిచాడు.అంతే కాదు జట్టుకు కీలక సమయాల్లో వికెట్లు తీయగల సామర్థ్యం కలవాడు.క్రికెట్ లో ఆల్ రౌండర్ నైపుణ్యాలు కలవాడు.
రచిన్ రవీంద్ర:
ప్రపంచ కప్ లో 10 ఇన్నింగ్స్ లలో 578 పరుగులు చేసి విధ్వంసక బ్యాటర్ గా తన సత్తా ఏంటో చూపించాడు.బౌలింగ్ తో కూడా బ్యాటర్లను చాలావరకు కట్టడి చేయగలడు.
న్యూజిలాండ్ ( New Zealand )జట్టులో కీలక ప్లేయర్ లలో ఒకడిగా స్థానం సంపాదించుకున్నాడు.ఇతడిని ఏ ఫ్రాంచైజీ దక్కించుకుంటోందో అనేది ఆసక్తికరంగా మారింది.
మిచెల్ స్టార్క్:
ఇతను 2015లో రాయల్ చాలెంజర్స్( Royal Challengers Bangalore ) బెంగళూరు తరఫున ఆడాడు.అప్పటినుంచి ఐపీఎల్ కు దూరంగా ఉన్నాడు.
ఐపీఎల్ 2024 వేలంలో తనను తాను నామినేట్ చేసుకోనున్నాడు.
ట్రావిస్ హెడ్:
వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టుపై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.ఒకవైపు అర్థ సెంచరీ, మరొకవైపు రెండు వికెట్లు తీసి ఆల్రౌండ్ ప్రదర్శన చేశాడు.
గెరాల్డ్ కోయెట్టీ:
దక్షిణాఫ్రికాకు చెందిన ఈ స్టార్ బౌలర్ 6.23 ఎకనామీతో ఏకంగా 20 వికెట్లు తీశాడు.ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను పరుగులు చేయకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేయగల సామర్థ్యం కలవాడు.
ఈ ఐదుగురు ఆటగాళ్లు జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు కీలక పాత్ర పోషించి జట్టును గెలిపించే సత్తాను కలిగి ఉన్నారు.కాబట్టి ఐపీఎల్ 2024 వేలంలో ఈ ఆటగాళ్లు అత్యధిక రికార్డు ధర పలికే అవకాశం ఉంది.